Singer Sunitha : కొడుకు కోసం ఎవ్వరూ చేయలేని త్యాగం చేసిన సింగర్ సునీత ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Singer Sunitha : కొడుకు కోసం ఎవ్వరూ చేయలేని త్యాగం చేసిన సింగర్ సునీత !

Singer Sunitha : సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో దాదాపు హీరోయిన్ లకు ఉన్న క్రేజ్ ఈ సింగర్ సునీతకి ఉంది. చాలామంది టాప్ హీరోయిన్ లకు సునీత డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. ఆమె వాయిస్ కి మంచి డిమాండ్ ఉంది. ఎన్నో విజయవంతమైన టాప్ మోస్ట్ హిట్ సాంగ్స్ ఆలపించిన సునీత.. ఇప్పుడు కొడుకు కోసం ఎవరు చేయలేని త్యాగం చేయడానికి సిద్ధపడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ […]

 Authored By sekhar | The Telugu News | Updated on :3 July 2023,9:00 am

Singer Sunitha : సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో దాదాపు హీరోయిన్ లకు ఉన్న క్రేజ్ ఈ సింగర్ సునీతకి ఉంది. చాలామంది టాప్ హీరోయిన్ లకు సునీత డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది. ఆమె వాయిస్ కి మంచి డిమాండ్ ఉంది. ఎన్నో విజయవంతమైన టాప్ మోస్ట్ హిట్ సాంగ్స్ ఆలపించిన సునీత.. ఇప్పుడు కొడుకు కోసం ఎవరు చేయలేని త్యాగం చేయడానికి సిద్ధపడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళ్తే సింగర్ సునీత తన కొడుకు ఆకాష్ నీ హీరోగా పరిచయం చేయడానికి రెడీ కావడం జరిగిందంట.

ఈ క్రమంలో లెజెండరీ ఫిలిం మేకర్ కె రాఘవేంద్రరావు బ్యానర్ ఆర్కే తెలుగు ఫిలిం షో ప్రొడక్షన్ లో ఆకాష్ హీరోగా “సర్కారు నౌకరి” అనే కొత్త సినిమాని నిర్మిస్తున్నారట. శేఖర్ గంగ మౌని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారట. పిరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ చాలా సైలెంట్ గా జరుగుతుంది. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. థియేటర్ ఆర్టిస్ట్ భావన వజపండల్ ఇందులో హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కీలక పాత్ర పోషిస్తున్నారట.

Singer Sunitha made a sacrifice that no one could do for her son

Singer Sunitha made a sacrifice that no one could do for her son

ఇంకా చాలామంది తెలుగు సీనియర్ నటీనటులు నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన కొడుకు మొదటి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో సింగర్ సునీత తనవంతుగా ముందుకు వచ్చి మరింతగా జనాల్లోకి ఈ సినిమాని తీసుకెళ్లే రీతిలో.. కృషి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో తన పాత్ర లేకపోయినా కొడుకు మొదటి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు దగ్గరుండి తానే మొత్తం చూసుకోబోతున్నట్లు.. అంతేకాదు కొడుకు మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తానే హోస్ట్ గా చేయాలని పట్టుబడుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది