Bigg Boss 5 Telugu : తొట్టిగ్యాంగ్‌లా మారిపోయింది.. షన్ను, సిరి, జెస్సీలపై ట్రోల్స్
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం కొన్ని వింతలు జరిగాయి. కొందరు మాత్రం నెట్టింట్లో దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. అందులో భాగంగా సిరి, షన్ను, జెస్సీకి తొట్టిగ్యాంగ్ అనే నామకరణం కూడా వచ్చేసింది. ఎప్పుడూ ఎదుటి పడి ఏడ్వడమే పనిగా పెట్టుకున్న ఈ ముగ్గురిని నెటిజన్లు దారుణంగా ఏకిపారేస్తున్నారు. ఐదో వారం ప్రారంభంలోనే తొట్టిగ్యాంగ్ మీద సెటైర్లు పడ్డాయి.
Siri Shannu And Jessie Gets Trolled In Bigg Boss 5 Telugu
షన్నును అందరూ కలిసి నామినేట్ చేయడంతో హీరోగా ఫీలవుతున్నాడు. ఎనిమిది మంది నామినేట్ చేయడంతో షన్ను హీరోలా ఫీలైపోయాడు. ఆ గ్రూపుకు తానే హీరోగా బిల్డప్ ఇస్తున్నాడు. ఇక ఈ ఐదో వారం తమ గ్యాంగులోనే ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వాలంటూ తెగ ప్రయత్నాలు చేశారు. ప్రణాళికలు రచించారు. కానీ బిగ్ బాస్ అనేవాడు ఒకడు ఉంటాడు. అందరూ కూడా వాడు ఆడించే ఆటలో పావులు అని షన్నుకు తెలియదేమో.
Bigg Boss 5 Telugu : షన్ను, సిరి, జెస్సీలపై నెగెటివ్ కామెంట్లు
bigg boss telugu season 5 this worst performer task
బిగ్ బాస్ ఇంటికి రాజు అనే టాస్కులో సిరి, షన్ను, జెస్సీల దొంగతనాలకు బిగ్ బాస్ గట్టి షాక్ ఇచ్చాడు. అలా మొత్తానికి వారి గాలితీసేశాడు. చివరకు వారి మొహాలు మాడిపోయాయి. ఇక నిన్నటి ఎపిసోడ్‌లోనూ సిరి, షన్ను, జెస్సీల గురించి ఇంటి సభ్యులు మాట్లాడుకుంటున్నారు. వారి ప్రపంచం ఏదో వారే అన్నట్టుగా, ఇంట్లో అందరూ తమనే టార్గెట్ చేసినట్టుగా ఫీలవుతున్నారంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ వారంలో జెస్సీ ఎలిమినేట్ అవుతాడని అనిపిస్తోంది. ఇంకొన్ని గంటలు ఆగితే ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుస్తుంది.
