Home » Entertainment » Sita Ramam Collections More Than Bimbisara Movie In Usa
Entertainment

Bimbisara – Sita Ramam : వార్ని.. అక్కడ బింబిసారనే తొక్కేసిన సీతారామం

Authored By
aruna
The Telugu News | Published on: August 8, 2022, 4:40 pm
Advertisement

Bimbisara – Sita Ramam : నందమూరి కళ్యాణ్ రామ్‌ – Kalyan Ram హీరోగా రూపొందిన బింబిసార మరియు దుల్కర్ సల్మాన్ – Dulquer Salmaan హీరోగా రూపొందిన సీతారామం సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రెండు సినిమాలకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. రెండు సినిమాలు కూడా మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరువ అయ్యాయి అంటూ ట్రెడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సినిమాలకు సంబంధించిన వసూళ్లు ప్రస్తుతం సోషల్‌ మీడియా లో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

బింబిసార సినిమా ఎలాంటి అనుమానం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ల దిశగా దూసుకు పోతుంది. మొదటి రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్ కు చేరువ అయ్యి మూడవ రోజు క్రాస్ చేసి లాభాల బాట పట్టింది. ఇప్పటికే దిల్ రాజు సక్సెస్‌ పార్టీని కూడా ఇచ్చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న బింబిసార ఓవర్సీస్ లో మాత్రం చేతులు ఎత్తేసింది. మొదటే సినిమాను అక్కడ తక్కువ విడుదల చేశారు. అందుకే ఇప్పుడు ఓవర్సీస్‌ లో వసూళ్లు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి అంటూ సమాచారం అందుతోంది.

sita ramam collections more than bimbisara movie in usa

Advertisement

సీతారామం విషయంలో మాత్రం అక్కడ బింబిసార విషయంలో రివర్స్ అయ్యింది. ఏకంగా 6 లక్షల డాలర్లను సీతారామం రాబట్టిందనే వార్తలు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ కు ఉన్న క్రేజ్ తో పాటు వివిధ భాషల్లో అమెరికాలో విడుదల అవ్వడం వల్ల ఈ వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్‌ ను క్రాస్ చేస్తుందని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందిన బింబిసార సినిమా నే సీతారామం తొక్కేసి యూఎస్ లో మిలియన్ డాలర్ల వసూళ్లకు చేరువ అయ్యింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి