sitara-enjoying-at-paris
Sitara : మహేష్ ఫ్యామిలీ టైం దొరికితే సరదాగా షికార్లు కొడుతుంటారనే విషయం తెలిసిందే. సినిమా పూర్తైందంటే షికార్లు కొట్టడం ఖాయం. తాజాగా మహేష్ ఫ్యామిలీ ప్యారిస్ వెళ్లింది. అక్కడ తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సితార అక్కడి అందమైన దృశ్యాలని తన కెమెరాలో బంధించి సోషల్ మీడయాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈఫిల్ టవర్ దగ్గర సితార చేసిన రచ్చకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సితార క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల సితార ఏ పోస్ట్ పెట్టినా అది నెట్టింట వైరల్ అవుతుంది. ఆ మధ్య‘ సర్కారు వారి పాట’ నుంచి కళావతి పాటకు స్టెప్పులేస్తే.. అది నెట్టింట చక్కర్లు కొట్టింది.
ఆ తర్వాత అదే సినిమాలో ‘ఎవ్రీ పెన్ని’ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఔరా అనిపించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సితూ పాప పోస్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది. శ్రీరామనవమి రోజు మహేష్ బాబు..సితార కూచిపూడి డ్యాన్స్ వీడియోని షేర్ చేశాడు. ఇది కూడా అలరించింది. తొలి కూచిపూడి నృత్య ప్రదర్శన. పరమ పవిత్రమైన శ్రీరామ నవమి రోజున ఈ అందరితో ఈ వీడియోషేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. సీతూ పాప.. నీ పని పట్ల నువ్వు చూపించే శ్రద్ధ చూస్తే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. నువ్వు నన్నింకా గర్వపడేలా చేస్తున్నావు. సితారకు డాన్స్‌లో శిక్షణ ఇచ్చిన అరుణ బిక్షు, మహతి బిక్షులకు ధన్యవాదాలు’’ అని తన పోస్ట్‌లో తెలిపాడు మహేష్.
sitara-enjoying-at-paris
ఇటీవల సితారపై తల్లి నమ్రత మాట్లాడుతూ.. “సరైన సమయంలో సరైన పనులు చేసేలా ఆమెకు మార్గనిర్దేశం చేయడం కోసం నేను మహేష్ ఉన్నామని భావిస్తున్నామన్నారు. ఆమె తన పరిమితుల్లో ఏమి చేయాలి.. ఏమి చేయకూడదనే విషయాల్లో బాగానే ఉందన్నారు నమ్రత. సితార ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయలేదన్నారు.చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మహేష్ ముద్దుబిడ్డ సితార.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.