Sitara : ప్యారిస్‌లో మ‌హేష్ ఫ్యామిలీ.. క్యూట్ వీడియో షేర్ చేసిన సితార‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sitara : ప్యారిస్‌లో మ‌హేష్ ఫ్యామిలీ.. క్యూట్ వీడియో షేర్ చేసిన సితార‌

Sitara : మ‌హేష్ ఫ్యామిలీ టైం దొరికితే స‌ర‌దాగా షికార్లు కొడుతుంటార‌నే విష‌యం తెలిసిందే. సినిమా పూర్తైందంటే షికార్లు కొట్ట‌డం ఖాయం. తాజాగా మహేష్ ఫ్యామిలీ ప్యారిస్ వెళ్లింది. అక్క‌డ తెగ సంద‌డి చేస్తున్నారు. ముఖ్యంగా సితార అక్క‌డి అంద‌మైన దృశ్యాల‌ని త‌న కెమెరాలో బంధించి సోష‌ల్ మీడ‌యాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈఫిల్ ట‌వ‌ర్ దగ్గ‌ర సితార చేసిన ర‌చ్చ‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. సితార క్యూట్ లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇటీవల సితార ఏ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :29 April 2022,11:00 am

Sitara : మ‌హేష్ ఫ్యామిలీ టైం దొరికితే స‌ర‌దాగా షికార్లు కొడుతుంటార‌నే విష‌యం తెలిసిందే. సినిమా పూర్తైందంటే షికార్లు కొట్ట‌డం ఖాయం. తాజాగా మహేష్ ఫ్యామిలీ ప్యారిస్ వెళ్లింది. అక్క‌డ తెగ సంద‌డి చేస్తున్నారు. ముఖ్యంగా సితార అక్క‌డి అంద‌మైన దృశ్యాల‌ని త‌న కెమెరాలో బంధించి సోష‌ల్ మీడ‌యాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈఫిల్ ట‌వ‌ర్ దగ్గ‌ర సితార చేసిన ర‌చ్చ‌కు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. సితార క్యూట్ లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. ఇటీవల సితార ఏ పోస్ట్‌ పెట్టినా అది నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆ మధ్య‘ సర్కారు వారి పాట’ నుంచి కళావతి పాటకు స్టెప్పులేస్తే.. అది నెట్టింట చక్కర్లు కొట్టింది.

Sitara : సితార త‌గ్గ‌ట్లేదుగా..

ఆ తర్వాత అదే సినిమాలో ‘ఎవ్రీ పెన్ని’ పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి ఔరా అనిపించింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సితూ పాప పోస్ట్‌ చేసిన వీడియో కూడా వైరల్‌ అయింది. శ్రీరామ‌న‌వ‌మి రోజు మ‌హేష్ బాబు..సితార కూచిపూడి డ్యాన్స్ వీడియోని షేర్ చేశాడు. ఇది కూడా అల‌రించింది. తొలి కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌. ప‌ర‌మ ప‌విత్ర‌మైన శ్రీరామ న‌వ‌మి రోజున ఈ అంద‌రితో ఈ వీడియోషేర్ చేసుకోవ‌డం హ్యాపీగా ఉంది. సీతూ పాప‌.. నీ ప‌ని పట్ల నువ్వు చూపించే శ్ర‌ద్ధ చూస్తే నాకెంతో ముచ్చ‌ట‌గా ఉంటుంది. నువ్వు న‌న్నింకా గ‌ర్వ‌ప‌డేలా చేస్తున్నావు. సితార‌కు డాన్స్‌లో శిక్ష‌ణ ఇచ్చిన అరుణ బిక్షు, మ‌హ‌తి బిక్షుల‌కు ధ‌న్య‌వాదాలు’’ అని త‌న పోస్ట్‌లో తెలిపాడు మ‌హేష్‌.

sitara enjoying at paris

sitara-enjoying-at-paris

ఇటీవ‌ల సితారపై తల్లి నమ్రత మాట్లాడుతూ.. “సరైన సమయంలో సరైన పనులు చేసేలా ఆమెకు మార్గనిర్దేశం చేయడం కోసం నేను మహేష్ ఉన్నామని భావిస్తున్నామన్నారు. ఆమె తన పరిమితుల్లో ఏమి చేయాలి.. ఏమి చేయకూడదనే విషయాల్లో బాగానే ఉందన్నారు నమ్రత. సితార ఎప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయలేదన్నారు.చిన్న వయసులోనే తనకంటూ ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడమేకాకుండా, తన డాన్స్ వీడియోలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది మహేష్ ముద్దుబిడ్డ సితార.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది