Home » Entertainment » Sitara Ghattamaneni Who Got A Remuneration That Exceeded Her Father
Entertainment

Sitara Ghattamaneni : మొదటి యాడ్ కి తండ్రిని మించిపోయే రెమ్యునరేషన్ తీసుకున్న సితార !

Authored By
Breaking News
The Telugu News | Published on: July 17, 2023, 11:00 am
Advertisement

Sitara Ghattamaneni : తండ్రి సూపర్ స్టార్ మహేష్ బాబు మాదిరిగానే కూతురు సితార చిన్న వయసులోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. మహేష్ చాలా చిన్న వయసులోనే సినిమా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. బాల నటుడిగా మహేష్ తండ్రి కృష్ణ సినిమాలు చేయడం జరిగింది. ఇప్పుడు తండ్రి మహేష్ మాదిరిగానే కూతురు సితార కూడా టీనేజ్ వయసులోనే దూసుకుపోతోంది. రకరకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుంది. కాగా తాజాగా చిన్న వయసులోనే అంతర్జాతీయ జ్యువెలరీ సంస్థకి పీఎంజే సితార ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా రాణిస్తుంది.

Advertisement

తాజాగా ఈ సంస్థకి సితార చేసిన యాడ్ ఏకంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ స్ట్రీట్ లో ప్రదర్శించడం జరిగింది. కూతురు ఎదుగుదలకు మహేష్ ఎంతగానో మురిసిపోయారు. పీఎంజే సంస్థ ఇటీవల హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయగా నమ్రత శిరోద్కర్ మరియు సితార పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏకంగా ఈ యాడ్ కి దాదాపు కోటి రూపాయలు సితార రెమ్యూనరేషన్ గా అందుకోవటం జరిగిందట.

Advertisement

Sitara Ghattamaneni who got a remuneration that exceeded her father

అసలు మహేష్ చిన్న వయసులో కూడా అంత డబ్బు అందుకోలేదట. ఇక యాడ్స్ చేస్తున్న సమయంలో కూడా మహేష్ ఇలాంటి ఆఫర్ స్టార్టింగ్లో కూడా అందుకోలేదంట. యాడ్ రంగంలో మొదటి సారే తండ్రిని మించి పోయే రీతిలో సితార రెమ్యూనరేషన్ అందుకోవటం సంచలనంగా మారింది. అయితే మొదటి రెమ్యూనరేషన్ డబ్బులు… చారిటీకి మొత్తం ఇచ్చేసిందట. దీంతో తండ్రి మాదిరిగానే సేవాగుణంలో సితార కూడా చిన్న వయసులో ఈ రకమైన మనసు కలిగి ఉండటం ఆనందదాయకమని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి