Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలోని పాటలకు మంచి క్రేజ్ వస్తుంది. కళావతి పాటు ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. ఈ మూవీ నుండి రెండు సాంగ్స్ విడుదల కాగా రెండు సోషల్ మీడియాను షేక్ చేశాయి. సెకండ్ సింగిల్ పెన్నీ… సాంగ్ తో మహేష్ వారసురాలు సితార ఘట్టమనేని వెండితెర ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సాంగ్ లో సితార స్టైలిష్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి.
యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్న పెన్నీ సాంగ్ సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు స్టెప్స్ వేస్తున్నారు.ఈ లిస్ట్ లో మహేష్ సిస్టర్ మంజుల కూడా చేరారు. ఆమె పెన్నీ సాంగ్ కి క్రేజీ స్టెప్స్ వేస్తూ ఓ వీడియో చేశారు. సదరు వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. చాలా మంది సన్నిహితులు పెన్నీ సాంగ్ కి డాన్స్ చేయాలంటూ కోరుతున్నారట. వాళ్ళ డిమాండ్ మేరకు పెన్నీ సాంగ్ చేశానంటూ మంజుల కామెంట్ చేశారు. మంజుల పెన్నీ సాంగ్ వీడియో వైరల్ గా మారింది. అయితే రియల్ సాంగ్‌లో స్టెప్పులేసిన సితార తాజాగా మరోసారి తన ఫ్రెండ్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఇందులో సితార చాలా సరదాగా డ్యాన్స్ చేసింది.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.సర్కారు వారి పాట విషయానికొస్తే మహేష్ షూటింగ్ పూర్తి చేశారు. మే 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది. దర్శకుడు పరుశురాం సర్కారు వారి పాట చిత్రాన్ని పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. పలు కారణాల చేత సంక్రాంతికి విడుదల కావాల్సిన సర్కారు వారి పాట ఆలస్యమైంది. మహేష్ చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలై రెండేళ్లు దాటిపోయింది. దీనితో ఫ్యాన్స్ సర్కారు వారి పాట చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్లో కూడా…
This website uses cookies.