Siva Kantamaneni Malli Madhurapudi Gramam Ane Nenu Movie Releases on 13th Oct
Madhurapudi Gramam Ane Nenu Movie మనుషులకి ఆత్మలు ఉన్నట్టే..ఒక ఊరికి ఆత్మ ఉంటే..ఆ ఆత్మ తన కథ తానే చెబితే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం “మధురపూడి గ్రామం అనే నేను”. శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ “కత్తి” ఫేమ్ మల్లి దర్శకత్వం వహించారు. మెలొడి బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా..
దర్శకుడు మల్లి మాట్లాడుతూ – “ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా చేద్దాం అని “మధురపూడి గ్రామం అనే నేను” అనే సినిమాను రూపొందించడం జరిగింది. లవ్, ఫ్రెండ్‌షిప్, పాలిటిక్స్, యాక్షన్, ఎమోషన్ ఇలా ఒక ఊరిలో ఎమైతే ఎగ్జయిటింగ్ అంశాలు ఉంటాయో అవన్నీ ఈ మట్టి కథలో ఉన్నాయి. ఒంగోలు, చీరాల బ్యాక్‌డ్రాప్లో జరిగే కథ ఇది. రాజమండ్రి, మచిలీపట్నం,హైదరాబాద్‌లోని పలు అందమైన, ఆసక్తికరమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. హీరోగా శివ కంఠమనేని గారు పర్‌ఫెక్ట్ యాప్ట్..అద్బుతమైన నటనని కనబరిచారు. హీరోయిన్‌గా క్యాథలిన్ గౌడ ఒక డిఫరెంట్ పాత్రలో తప్పక మెప్పిస్తుంది. భరణి శంకర్, సత్య, నూకరాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతూ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అనే నమ్మకం ఉంది“ అన్నారు.
Siva Kantamaneni Malli Madhurapudi Gramam Ane Nenu Movie Releases on 13th Oct
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ – `కాన్సెప్ట్ ఓరియంటేషన్‌తో ఒక మంచి యాక్షన్ డ్రామాగా ఖర్చుకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబరు 13న ప్రపంచ వ్యాప్తంగా “మధురపూడి గ్రామం అనే నేను” చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం` అన్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.