Bigg Boss OTT Telugu :తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఐదు వారాల్లో అడుగు పెట్టబోతోంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్, రెండవ వారంలో శ్రీ రాపాక, మూడవ వారంలో రేడియో జాకీ చైతూ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వీరి ముగ్గురిలో ఇద్దరు ఎలిమినేషన్ ను సరైన ఎలిమినేషన్ కాదు అంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. మరో వైపు నాలుగో వారంలో ఎలిమినేట్ సరయు అంటూ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. అధికారికంగా షో స్ట్రీమింగ్ అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో బిగ్ బాస్ ప్రేక్షకులు నిర్వాహకుల పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ముమైత్ ఖాన్ గత సీజన్లో చాలా ఇబ్బంది పడి నెట్టుకు వచ్చిన విషయం తెలిసిందే, ఈ సీజన్లో ఆమెకి కచ్చితంగా మంచి అవకాశం దక్కుతుందని ప్రతి ఒక్కరు భావించారు. అయితే ఆమెను కనికరం లేకుండా మొదటి వారంలోనే ఎలిమినేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక రెండవ వారంలో ఎలిమినేషన్ విషయం లో పెద్ద వివాదం జరగలేదు. కానీ మూడవ వారంలో ఎలిమినేట్ అయిన చైతూ మంచి ఎంటర్టైనర్ అనే విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే ప్రేక్షకులు అతడు ఎలిమినేట్ అవ్వడం పై విమర్శలు చేశారు. కచ్చితంగా చైతూ ఎంటర్టైనర్.. అతడిని ఎలిమినేట్ చేయడం అనేది దారుణం అంటూ నిర్వాహకులపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ప్రేక్షకుల నిర్ణయం ఏమో కానీ బిగ్బాస్ నిర్ణయం చాలా తీవ్రమైన విమర్శలకు తెర తీస్తోంది. గత సీజన్లో సరయు మొదటి వారంలో ఎలిమినేట్ తీవ్ర మనో వేదనకు గురి అయింది. ఈసారి కూడా ఆమెకు చాలా తక్కువ సమయంలోనే అవుట్ పాస్ ను బిగ్బాస్ ఇచ్చేశాడు. దాంతో ప్రేక్షకులు బిగ్బాస్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో ఎన్నో సార్లు ఓట్ల ఆధారంగా కాకుండా తమ ఇష్టానుసారంగా ఎలిమినేషన్ చేసిన బిగ్బాస్ నిర్వాహకులు ఈసారి మాత్రం ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అసలు బిగ్ బాస్ కి జాలి, దయ, కనికరం అనేవి ఉన్నాయా. వారిపై అయ్యో అనే జాలి కూడా చూపించకుండా ఇలా చేయడంతో పాటు.. టాస్క్ ల పేరు తో అత్యంత హింసిస్తున్న బిగ్ బాస్ కు దయ లేదు అంటూ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఈమధ్య ఎక్కువ వార్తలు వస్తున్నాయి. ఆయన పుష్ప 2…
Good News : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరాల జల్లు ప్రకటిస్తుంది. తాజాగా తెలంగాణలో భూమిలేని నిరుపేదలకు 12 వేల…
Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది. వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. దీంతో వచ్చే ఎన్నికలలో మంచి…
Virat kohli : టీమిండియా తీరు మారడం లేదు.రెండో టెస్ట్‌లో దారుణంగా ఓడిన ఇండియా గబ్బా వేదికగా జరగుతున్న మూడో…
Allu arjun Nagababu : గత కొద్ది రోజులుగా బన్నీ వ్యవహారం నెట్టింట చర్చనీయాంశంగా మారుతుంది. పుష్ప సినిమా విడుదల…
Justice : థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ని…
Constipation : ఉదయం లేవగానే టీ టీ తాగకుండా ఏ పని చేయo. మరికొందరు టీతో పాటు సిగరెట్ ని…
Sukhanya Samriddhi Yojana : సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బాలికల భవిష్యత్తు కోసం ఆర్ధిక భద్రత ఏర్పాటు…
This website uses cookies.