Home » Entertainment » Social Media Trolls On Ram Gopal Varma Rrr Movie Comments
Entertainment

Ram Gopal Varma : రామ్‌ గోపాల్‌ వర్మ.. నీది నాలుకేనా.. బుద్ది ఉన్నవాడు ఎవడైనా అలా మాట్లాడుతాడా?

Authored By
aruna
The Telugu News | Published on: August 24, 2022, 10:20 pm
Advertisement

Ram Gopal Varma : వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అంటే ఒకప్పుడు ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గత కొంత కాలంగా తనకు సంబంధం ఉన్నా లేకున్నా కూడా ట్రెండ్‌ అవుతున్న విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొన్ని విషయాలు చాలా లోతుగా ఆలోచించి వ్యాఖ్యలు చేయడంతో అంతా కూడా ఆయన్ను సమర్థిస్తారు.. ఆయన వ్యాఖ్యలను నిజమే అంటారు. కానీ కొన్ని సార్లు మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్కరు కూడా సమర్థించే విధంగా ఉండవు. అవి నిజాలే అయినా కూడా కొన్నింటిని మనం చూసి చూడకుండా వదిలేయాల్సి ఉంటుంది.

Advertisement

ఇప్పుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా గురించి మాట్లాడాడు. ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ను చూస్తుంటే సర్కస్ చూసినట్లుగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తెర తీస్తున్నాయి. ఒక వైపు ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవబోతుంది.. ఆస్కార్ దక్కించుకోబోతుంది అంటూ అంతా చాలా బలంగా నమ్ముతున్నారు.. చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో వర్మ ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బుద్ది ఉన్న వాడు ఎవడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మనం చూడవు. కేవలం వర్మ వంటి వాడు మాత్రమే ఈ వ్యాఖ్యలు చేస్తాడంటూ రాజమౌళి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

social media trolls on ram gopal varma rrr movie comments

Advertisement

గత కొంత కాలంగా రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా కూడా వివాదాస్పదం అవుతుంది. మళ్లీ ఇప్పుడు వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను అవమానిస్తూ మాట్లాడటం అంటే తెలుగు సినిమాను మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాను మరియు ఇండియన్ సినీ ప్రేక్షకులను అవమానించడమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా పై వర్మ కారు కూతలు కూసినంత మాత్రాన ఆ సినిమా యొక్క గొప్పతనం తగ్గదు అనేది కొందరి అభిప్రాయం. ఆయన నోరు అదుపులో పెట్టుకోకుంటే ముందు ముందు ఇండియన్ సినిమా ను మరింతగా అవమాన పర్చడం ఖాయం అంటూ కొందరు విమర్శిస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి