
Sr NTR for one hundred rupees.. Did that heroine face so much trouble..?
Sr NTR : సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకానొక సమయంలో దాతల కోసం ఎదురు చూసే వాళ్లు. మంచి గుర్తింపు తెచ్చుకున్నాక ఆర్థికంగా నిలదొక్కుకున్నాక కూడా అంతా పోగొట్టుకుని చివరకు హస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేక దీన స్థితిలో ఉన్నారు. ఇందులో ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇబ్బందులు పడుతుంటారు. అలాగే మహానటి సావిత్రి కూడా ఒకానొక సందర్భంలో ఆర్థిక క్రమశిక్షణ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంతో సంపాదించుకున్న నాగయ్య, చలం..వంటి వారు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. అయితే ఇవన్నీ వారు చేసిన దాన ధర్మాలు.. ఆర్థిక క్రమ శిక్షణ లేక పోవడం కారణంగానే ఇబ్బందులు పడ్డారని చెబుతుంటారు.
నటసార్వబౌమ నందమూరి తారకరామారావు.. అన్నగారు గురించి ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో అద్బుతమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప నటుడు. అయితే ఎన్టీఆర్ ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. ఆర్థికంగా కూడా ఎంతో క్రమ శిక్షణతో మెలిగిన ఎన్టీఆర్ కు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డారట. ఓ టైమ్ లో రూ.100 కోసం ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయట. కెరీర్ ప్రారంభంలో చాలా తక్కువ పారితోషికానికి పనిచేసేవారట. నెలకు రూ. 70 నుంచి 100 రూపాయలకే ఆయన స్టూడియోల్లో పనిచేశారు. ఈ సొమ్ముతోనే నెలంతా గడిపేవారట. అయితే ఎవరు కొత్తవారు వచ్చినా.. ఎన్టీఆర్ రూంలోనే బస చేసేవారట. దీంతో ఖర్చులు పెరిగి వచ్చిన డబ్బు సరిపోక ఇబ్బంది పడేవారట. ఇలా తొలినాళ్లలో ఎన్టీఆర్ కి కూడా ఇబ్బందులు తప్పలేదు.
Sr NTR for one hundred rupees.. Did that heroine face so much trouble..?
అలాగే సీనియర్ నటి వైజయంతి మాల కూడా ఇబ్బంది పడ్డారట. రూ.50కే ఆమె స్టూడియోల్లో పనిచేయాల్సి వచ్చింది. దీంతో వచ్చిన జీతం సరిపోక అప్పులు చేయడం.. వాటిని తీర్చేందుకు ఇబ్బందులు పడడం.. సర్వసాధారణంగా మారిందని చెప్పుకొనేవారు. అయితే ఆ తర్వాత సినిమాలు పుంజుకోవడంతో అటు ఎన్టీఆర్.. ఇటు వైజయంతి మాల కూడా పుంజుకున్నారు. ఇక అప్పటినుంచి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.