NTR ఆ హీరోయిన్ కు గాయం అయితే కూల్ డ్రింక్ ట్రీట్ మెంట్ చేసిన సీనియ‌ర్ ఎన్టీఆర్..!

Authored By mallesh | The Telugu News | Published on: November 3, 2021, 7:15 am

NTR  న్టీఆర్ అంటే ఓ ప్ర‌భంజ‌నం.. సినీ చ‌రిత్ర‌లో ఓ చెరిగిపోని అధ్యాయం. విశ్వ‌విఖ్యాత న‌ట‌సౌర్వ‌భౌముడిగా ఆయ‌న వేసిన ముద్ర ఇంకా జ‌నాల్లో ఉంది. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తంగా చాటిన దిగ్గ‌జ న‌టుడిగా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. ఆయ‌న ప్ర‌యాణం ప్ర‌తి ఒక్క‌రికీ ఆద‌ర్శం. అలాంటి ఆయ‌న జీవితంలో కూడా ఎన్నో మ‌రపు రాని స‌న్నివేశాలు ఉన్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా త‌న స్థాయిని చూడ‌కుండా ప్ర‌తి ఒక్క‌రినీ ఎంతో ఆప్యాయంగా ఆయ‌న ప‌ల‌క‌రించేవారు. ఎవ‌రికి ఎలాంటి ఆప‌ద వ‌చ్చినా స‌రే తానేఏ స్వ‌యంగా వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌రీ వివ‌రాలు అడిగి తెలుసుకునేవారు.

sr ntr treated the heroine with a cool drink

sr ntr treated the heroine with a cool drink

ఇక త‌న సినిమాల్లో న‌టించే హీరోయిన్ల‌ను కూడా ఎన్టీ రామారావు చాలా జాగ్ర‌త్త‌గా చూసుక‌నేవార‌నే పేరుంది. వారికి ఎలాంటి ఆద‌ప వ‌చ్చినా స‌రే ఆదుకునే వారంట‌. ఇక ఓ సంఘ‌ట‌న గురించి చెప్పాలి. అదేంటంటే 1959 సంవ‌త్స‌రంలో ఎన్టీఆర్ హీరోగా సొంత ఊరు మూఈ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున‌న్న స‌మ‌యంలో రాజ సులోచ‌న హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా ఘంట‌సాల డైరెక్ష‌న్ లో జరుగుతోంది. అయితే మూవీ సెట్ వేస్తున్న క్ర‌మంలో కొన్ని మేకులు షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు కింద ప‌డ‌టంతో అది చూసుకోకుండా హీరోయిన్ వాటి మీదుగా వెళ్లింది.

NTR సొంత ఊరు సినిమా షూటింగ్‌లో రాజ‌సులోచ‌న‌కు గాయం..

sr ntr treated the heroine with a cool drink

sr ntr treated the heroine with a cool drink

దీంతో ఆమె కాలిలో చాలా లోతుగా ఓ మేకు దిగింది. అదే స‌మ‌యంలో ఎన్టీ రామారావు ఐస్ తో కూడుకున్న కూల్ డ్రింక్ తాగుతుండ‌గా ఈ విష‌యం ఆయ‌న‌కు తెలిసింది. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే త‌న చేతిలో ఉన్న‌టువంటి కూల్ డ్రింక్ సాయంతో ఆమెకు ట్రీట్ మెంట్ చేశారు. ఆ చ‌ల్ల‌ని కూల్ డ్రింక్‌ను ఆమె గాయం మీద పోసి చేతి గుడ్డ‌తో ర‌క్తం కార‌కుండా ఒత్త‌డంతో ర‌క్త‌స్రావం ఆగిపోయింది. స్వ‌యంగా ఎన్టీ ఆర‌రే ఇలా వ‌చ్చి స‌ప‌ర్య‌లు చేయ‌డంతో ఆమెతో పాటు అక్క‌డున్న వారంతా షాక్ అయిపోయారంట‌. ఆమె తాను మేకును చూసుకోలేద‌ని అందుకు ఎన్టీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. ఇలా ప్ర‌తి ఒక్క‌రి బాగోగులు చూసుకునే వారంట ఎన్టీఆర్‌.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp