Sreeja Kalyan Dev : శ్రీజ‌తో విడాకుల విష‌యంపై స్పందించిన క‌ళ్యాణ్ దేవ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreeja Kalyan Dev : శ్రీజ‌తో విడాకుల విష‌యంపై స్పందించిన క‌ళ్యాణ్ దేవ్..!

Kalyan Dev: ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో విడాకుల వ్య‌వ‌హారం చ‌ర్చనీయాంశంగా మారింది. గ‌త ఏడాది స‌మంత‌-చైతన్య‌, అమీర్ ఖాన్- కిర‌ణ్ రావ్ దంప‌తులు విడిపోగా, ఈ ఏడాది ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య విడిపోయిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక శ్రీజ‌- క‌ళ్యాన్ దేవ్‌ల దాంపత్యంపై కొద్ది రోజులుగా అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. వారు విడిపోయార‌ని కొద్ది రోజుల నుండి ప్ర‌చారం సాగుతుండ‌గా.. క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీజ విడిపోయారు అని చెప్ప‌డానికి దానికి మ‌రో ప్రూఫ్ కూడా దొరికినట్టయ్యింది. క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :19 January 2022,9:05 am

Kalyan Dev: ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో విడాకుల వ్య‌వ‌హారం చ‌ర్చనీయాంశంగా మారింది. గ‌త ఏడాది స‌మంత‌-చైతన్య‌, అమీర్ ఖాన్- కిర‌ణ్ రావ్ దంప‌తులు విడిపోగా, ఈ ఏడాది ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య విడిపోయిన‌ట్టు ప్ర‌క‌టించారు. ఇక శ్రీజ‌- క‌ళ్యాన్ దేవ్‌ల దాంపత్యంపై కొద్ది రోజులుగా అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. వారు విడిపోయార‌ని కొద్ది రోజుల నుండి ప్ర‌చారం సాగుతుండ‌గా.. క‌ళ్యాణ్ దేవ్‌, శ్రీజ విడిపోయారు అని చెప్ప‌డానికి దానికి మ‌రో ప్రూఫ్ కూడా దొరికినట్టయ్యింది.

క‌ళ్యాణ్ దేవ్‌ను పెళ్లి చేసుకున్న త‌ర్వాత శ్రీజ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఐడీని శ్రీజా క‌ళ్యాణ్‌గా మార్చుకున్నారు. . ఎప్పటినుంచో శ్రీజ కళ్యాణ్ అనే తన సోషల్ మీడియాలో ఉంటుంది. తాజాగా నిన్న తన పేరు పక్కన కళ్యాణ్ అనే పేరుని తీసేసి కొణిదల అని తన తండ్రి ఇంటిపేరుని జత చేసుకుంది. గతంలో సమంత కూడా విడిపోయే ముందు ఇలాగే అక్కినేని అని తీసేసి తన పేరు పెట్టుకుంది. దీంతో వీరిద్దరూ కూడా విడిపోతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ వార్తలపై శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ సన్నిహితుల వద్ద స్పందించినట్లు సమాచారం.

Sreeja Kalyan dev responds on rumors

Sreeja Kalyan dev responds on rumors

Sreeja Kalyan Dev : పుకార్ల‌పై స్పందించిన క‌ళ్యాణ్‌

పర్సనల్ జీవితాలకు సంబంధించి మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారట. కుటుంబాల్లో జరిగే విషయాలను మీడియాకు చెప్పాల్సిన పని లేదని అతని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట. సెల‌బ్స్ మ‌నోభావాల‌తో ఆడుకోవ‌డం ఏ మాత్రం మంచిది కాద‌ని ఆయ‌న అన్న‌ట్టు స‌మాచారం. ఇక కళ్యాణ్ దేవ్ రీసెంట్‌గా సూప‌ర్ మ‌చ్చి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమాకి మెగా ఫ్యామిలీ ఎలాంటి స‌పోర్ట్ అందించ‌లేదు. అలానే ఈ మ‌ధ్య మెగా వేడుక‌ల‌లో కూడా క‌ళ్యాణ్ క‌నిపించ‌డం లేదు. దీంతో అనుమానాలు ఎక్కువ‌య్యాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది