
Sreeleela : శ్రీలీల కూడా మొదలు పెట్టిందోచ్.. బీటౌన్ నీళ్లు బాగా పడ్డట్టున్నాయిగా..!
Sreeleela : కన్నడ లో ఒక సినిమా చేసి ఆ తర్వాత తెలుగు ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల Sreeleela ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుని తెలుగులో వరుస స్టార్ సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అనురాగ్ బసు డైరెక్షన్ లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ చూస్తే అయ్య బాబోయ్ శ్రీలీల ఏంటి రచ్చ అనుకుంటారు. కార్తీక్ ఆర్యన్ సింగర్ గా రఫ్ లుక్ తో కనిపిస్తుంటే క్యూట్ లవర్ గా శ్రీలీల Sreeleela కనిపిస్తుంది. అంతేకాదు ఒక రేంజ్ లో రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తుంది. అంతేకాదు లిప్ లాక్ గట్రా కానిచ్చినట్టే అనిపిస్తుంది. తెలుగులో దాదాపు ఏడు ఎనిమిది సినిమాల దాకా చేసిన శ్రీలీల Sreeleela ఏ సినిమాలో కూడా రెచ్చిపోలేదు.
Sreeleela : శ్రీలీల కూడా మొదలు పెట్టిందోచ్.. బీటౌన్ నీళ్లు బాగా పడ్డట్టున్నాయిగా..!
కానీ బాలీవుడ్ Bollywood వెళ్లగానే అక్కడ నీళ్లు పడ్డాయనుకుంటా ఒక్కసారిగా అదరగొట్టేస్తుంది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల చేస్తున్న సినిమా ఆషికి ఫ్రాంచైజ్ లా అనిపిస్తుంది. ఆషికి ఫ్రాంచైజ్ లో భాగమైతే మాత్రం శ్రీలీలకు బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. శ్రీలీల బాలీవుడ్ లో వచ్చిన ఫస్ట్ ఆఫర్ తో ఎలాగైనా బీ టౌన్ ప్రేక్షకుల హృదయాలను గెలవాలని అనుకుంది. అందుకే ఈ సినిమాలో నో లిమిట్స్ అనేసేలా చేస్తుంది.
తెలుగులో కూడా నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమా చేస్తున్న శ్రీలీల మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు అంచనా వేయలేకపోయారు. సో శ్రీలీల కూడా నేషనల్ లెవెల్ లో అదరగొట్టబోతుందన్నమాట. కార్తీక్ ఆర్యన్ శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాను టీ సీరీస్ నిర్మిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి రిలీజ్ లాక్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. Srileela, Karthik Aryan,Dhamaka, Bollywood, Anurag Basu, Ashiqui
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.