Sreeleela : శ్రీలీల కూడా మొదలు పెట్టిందోచ్.. బీటౌన్ నీళ్లు బాగా పడ్డట్టున్నాయిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreeleela : శ్రీలీల కూడా మొదలు పెట్టిందోచ్.. బీటౌన్ నీళ్లు బాగా పడ్డట్టున్నాయిగా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :16 February 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Sreeleela : శ్రీలీల కూడా మొదలు పెట్టిందోచ్.. బీటౌన్ నీళ్లు బాగా పడ్డట్టున్నాయిగా..!

Sreeleela  : కన్నడ లో ఒక సినిమా చేసి ఆ తర్వాత తెలుగు ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల Sreeleela ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుని తెలుగులో వరుస స్టార్ సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అనురాగ్ బసు డైరెక్షన్ లో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ చూస్తే అయ్య బాబోయ్ శ్రీలీల ఏంటి రచ్చ అనుకుంటారు. కార్తీక్ ఆర్యన్ సింగర్ గా రఫ్ లుక్ తో కనిపిస్తుంటే క్యూట్ లవర్ గా శ్రీలీల  Sreeleela కనిపిస్తుంది. అంతేకాదు ఒక రేంజ్ లో రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తుంది. అంతేకాదు లిప్ లాక్ గట్రా కానిచ్చినట్టే అనిపిస్తుంది. తెలుగులో దాదాపు ఏడు ఎనిమిది సినిమాల దాకా చేసిన శ్రీలీల Sreeleela ఏ సినిమాలో కూడా రెచ్చిపోలేదు.

Sreeleela శ్రీలీల కూడా మొదలు పెట్టిందోచ్ బీటౌన్ నీళ్లు బాగా పడ్డట్టున్నాయిగా

Sreeleela : శ్రీలీల కూడా మొదలు పెట్టిందోచ్.. బీటౌన్ నీళ్లు బాగా పడ్డట్టున్నాయిగా..!

Sreeleela: ఆషికి ఫ్రాంచైజ్ లో భాగమైతే మాత్రం

కానీ బాలీవుడ్ Bollywood వెళ్లగానే అక్కడ నీళ్లు పడ్డాయనుకుంటా ఒక్కసారిగా అదరగొట్టేస్తుంది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల చేస్తున్న సినిమా ఆషికి ఫ్రాంచైజ్ లా అనిపిస్తుంది. ఆషికి ఫ్రాంచైజ్ లో భాగమైతే మాత్రం శ్రీలీలకు బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు. శ్రీలీల బాలీవుడ్ లో వచ్చిన ఫస్ట్ ఆఫర్ తో ఎలాగైనా బీ టౌన్ ప్రేక్షకుల హృదయాలను గెలవాలని అనుకుంది. అందుకే ఈ సినిమాలో నో లిమిట్స్ అనేసేలా చేస్తుంది.

తెలుగులో కూడా నితిన్ సరసన రాబిన్ హుడ్ సినిమా చేస్తున్న శ్రీలీల మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఈ రేంజ్ లో ఉంటుందని ఎవరు అంచనా వేయలేకపోయారు. సో శ్రీలీల కూడా నేషనల్ లెవెల్ లో అదరగొట్టబోతుందన్నమాట. కార్తీక్ ఆర్యన్ శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాను టీ సీరీస్ నిర్మిస్తుంది. ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి రిలీజ్ లాక్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. Srileela, Karthik Aryan,Dhamaka, Bollywood, Anurag Basu, Ashiqui

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది