Home » Entertainment » Sreemukhi Kiss To Naveen Chandra In Rakhi Special Event
Entertainment

Sreemukhi : ఈ ముద్దుల గోల ఏంటిరా బాబు.. బరితెగించిన శ్రీముఖి, ఆది, రాంప్రసాద్

Authored By
aruna
The Telugu News | Published on: August 6, 2022, 2:40 pm
Advertisement

Sreemukhi : బుల్లితెరపై హద్దులు చెరిపేస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా రెచ్చిపోతోన్నారు. ముద్దులతో రొమాన్స్ చేసేస్తున్నారు. ఒకప్పుడు బుల్లితెర అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ చూస్తారు.. కాస్త పద్దతిగా చేయాలని అనుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి నియమాలేవీ లేవు. ఇష్టమొచ్చినట్టుగా చేసేస్తున్నారు. చివరకు డ్యాన్స్ షోలోనూ ముద్దులతో రెచ్చిపోతోన్నారు. ఇప్పుడు ఆ పైత్యం పండుగ ఈవెంట్లలోనూ చూపిస్తున్నారు. రాఖీ స్పెషల్ ఈవెంట్ అంటూ మల్లెమాల టీం ఒక ఈవెంట్ చేస్తోంది. హలో బ్రదర్ అంటూ రాఖీ స్పెషల్‌గా చేయబోతోన్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలు ఇది వరకు రిలీజ్ చేశారు. ఇందులో నవీన్ చంద్ర ముఖ్య అతిథిగా వచ్చాడు.

Advertisement

ఇక చెల్లెల్లు అన్నయ్యకు సర్ ప్రైజ్ ఇస్తారంటూ పరదేశీ అక్క, భాను తమ్ముడు, రోల్ రైడా చెల్లి ఇలా అందరూ వచ్చారు. ఇక అక్కడి వరకు బాగానే ఉంది. రాఖీలు కట్టించడం, ప్రేమలు చూపించడం వరకు ఓకే. కానీ తాజాగా ఓ ప్రోమో విడుదల చేశారు. ఇందులోనే చండాలం అంతా ఉంది. ఈ ప్రోమోలో శ్రీముఖిని ముద్దులతో ముంచెత్తితే.. శ్రీముఖి కూడా ముద్దు పెట్టేసింది. అక్కడ కొన్ని వస్తువులున్నాయని, పాటలో వచ్చినట్టుగా.. ఆ వస్తువు ఏదో తన వద్దకు తీసుకుని ఎవరు ముందుగా వస్తే వారు గెలిచినట్టు అని చెబుతుంది. ఈ పోటిల్లో రామ్ ప్రసాద్, ఆది పాల్గొంటారు. మొదటి రౌండ్‌లో ఆకలేస్తే అన్నం పెడుతా. అలిసొస్తే ఆయిల్ పెడతా..మూడొస్తే ముద్దులు పెడతా అని పాట వస్తుంది.

Sreemukhi Kiss to Naveen Chandra In Rakhi Special Event

Advertisement

దీంతో ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ చటుక్కుని వెళ్లి శ్రీముఖి చేతికి ముద్దులు పెడతారు. దీంతో శ్రీముఖి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలే ఈ ఈవెంట్‌లో నవీన్ చంద్రను బావ అని పిలుస్తుంది శ్రీముఖి. అలా ఆ ఇద్దరూ ముద్దులు పెట్టడంతో బావా అని గట్టిగా అరుస్తుంది శ్రీముఖి. నవీన్ చంద్ర స్టేజ్ మీదకు వస్తాడు.. నవీన్ చంద్ర బుగ్గను చూపిస్తే.. బుగ్గ మీద ముద్దు పెట్టేస్తుంది శ్రీముఖి. దీంతో అక్కడున్న ఆది, రాం ప్రసాద్ నోరెళ్లబెడతారు. ఈ ముద్దుల గోల ఏంటని జనాలు తల పట్టుకుంటున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి