Home » Entertainment » Sreemukhi On Chiranjeevi In Suma Youtube Channel
Entertainment

Sreemukhi : చిరంజీవిపై కన్నేసినట్టు.. శ్రీముఖి కోరికలు మామూలుగా లేవు!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 27, 2021, 7:35 pm
Advertisement

బిగ్ బాస్ మూడో సీజన్ ఫినాలే ఎపిసోడ్ నాడు జరిగిన కొన్ని సంఘటనలు అందరికీ గుర్తుంటాయి. అందులో శ్రీముఖి,చిరంజీవికి పెట్టిన ముద్దుతో అందరూ షాక్ అయ్యారు. సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో చటుక్కున ముద్దు పెట్టేసింది. దీంతో చిరంజీవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అలా చిరంజీవి మీద తన ప్రేమను చాటుకుంది శ్రీముఖి.

Advertisement

Sreemukhi On Chiranjeevi In Suma Youtube channel

అయితే తాజాగా శ్రీముఖి మరోసారి తన అభిమానాన్ని చూపించింది. తాజాగా సుమ యూట్యూబ్ చానెల్ కోసం శ్రీముఖి స్పెషల్ గెస్టుగా వచ్చింది. ఇందులో సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు శ్రీముఖి సమాధానం చెప్పింది. అందులోనూ చిరంజీవి గురించేఎక్కువగాచెప్పింది. ఏదైనా ఒక రూమర్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ఏం క్రియేట్ చేసుకుంటావ్ అని శ్రీముఖిని సుమ అడిగింది.

Advertisement

Sreemukhi On Chiranjeevi In Suma Youtube channel

చిరంజీవి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ వచ్చిందని రూమర్ క్రియేట్ చేసుకుంటాను.. త్వరలోనే అది నిజం కాబోతోంది కూడా అని శ్రీముఖి చెప్పింది. ఒక రోజంతా కూడా ఎవరిలానైనా మారిపోవాలని అనుకుంటే.. ఎవరిలా మారిపోతావ్ అని సుమ అడిగింది. చిరంజీవిలా మారిపోతాను.. ఆయన ఎంతో హంబుల్‌గా ఉంటారని విన్నాను.. ఆయన ఏం తింటారు.. ఎలా పడుకుంటారు.. అన్ని తెలసుకుంటాను అని శ్రీముఖి చెప్పింది. చిరంజీవి గారు కాస్త జాగ్రత్తగా ఉండండి.. ఈమెకు ఏవేవో కోరికలు ఉన్నాయ్ అని సుమ సెటైర్ వేసేసింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి