
Sreenu : నేను వి.వి వినాయక్ కష్టపడి ప్రభాస్ కోసం ఫుడ్ తెస్తే ఏమన్నారో తెలుసా...!
Sreenu : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ప్రస్తుత కాలంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది ఆర్టిస్టులను కూడా మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా కమెడియన్ ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అయితే ప్రభాస్ శ్రీను తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన ప్రతి సినిమాలో ఓ పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. అలా ప్రభాస్ శ్రీను తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్న నటుడుగా అందరి మననలు పొందాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నా క్యారెక్టర్ లేకపోయినా సరే దర్శకులు ఏరికోరి నన్ను కావాలని సినిమాలో పెట్టేవారని తెలియజేశారు.
మరీ ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్న సమయంలో నాకు డేట్స్ లేకపోయినా సరే కావాలని పిలిపించి మరి ఆ సినిమా దర్శకుడు పెట్టించినట్లుగా ఈ సందర్భంగా ప్రభాస్ శ్రీను తెలియజేశారు. అయితే ప్రభాస్ శ్రీను కొన్ని రోజులు సెట్స్ లోకి రాకపోతే సెట్ అంత బోసిగా కనిపించేదట. ఇక ఈ విషయాన్ని దర్శకులు కూడా చాలా సార్లు చెప్పినట్లుగా ఆయన తెలిపారు. అందుకే తాను సెట్స్ లోకి వెళ్ళినప్పుడు వారితో సరదాగా గడుపుతానని , వారందరిని నవ్విస్తూ ఉంటానని అందుకే చాలామంది నన్ను కావాలని కోరుకుంటారు అంటూ ఆయన తెలిపారు. ఇక ఈ క్రమంలోనే యాంకర్ మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు అని అడగగా ప్రభాస్ శ్రీను సమాధానం ఇస్తూ పరుశురాం గారు, బుజ్జి గారు, రాజమౌళి గారు, మరియు వివి వినాయక్ గారు అని తెలియజేశారు. ఇక వీరితో ప్రభాస్ శ్రీను చాలా సన్నిహితంగా ఉంటారట. వీరిలో వి.వి వినాయక్ గారు ప్రభాస్ శ్రీను కంపెనీ చాలా బాగా ఎంజాయ్ చేసేవారని ఈ సందర్భంగాగా తెలియజేశారు.
ఇక యోగి సినిమా చేసే సమయంలో వారు గుర్తుండిపోయే సందర్భాలను గడిపారని తెలియజేశారు. ఇక ఆ సమయంలో ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుంటే తాను వినయ్ గారు ఖాళీగా ఉండేవారట. ఆ సందర్భంలోనే దగ్గరిలో ఫుడ్ స్టాల్స్ ఏవి లేకపోవడంతో కె.ఎఫ్.సీ కి వెళ్లి స్వయంగా వారే భోజనాలు తీసుకువచ్చి సినీ యూనిట్ కి పెట్టేవారని ప్రభాస్ శీను తెలియజేశారు. ఇక వి.వి వినాయక్ గారు కూర్చుని మాట్లాడటం మొదలుపెడితే చాలా ప్రేమగా పిలుస్తారని ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటారని ఆయన తెలిపారు.అందుకే వి.వి వినాయక్ గారితో మాట్లాడుతుంటే టైం అసలు తెలిసేది కాదని ప్రభాస్ శ్రీను ఈ సందర్భంగా తెలియజేశారు. తాను ఏ సినిమాకు పని చేస్తే ఆ సినిమా డైరెక్టర్ తో చాలా సన్నిహితంగా మెలిగిపోయే వాడినని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ శ్రీను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.