Sreenu : నేను వి.వి వినాయక్ కష్టపడి ప్రభాస్ కోసం ఫుడ్ తెస్తే ఏమన్నారో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreenu : నేను వి.వి వినాయక్ కష్టపడి ప్రభాస్ కోసం ఫుడ్ తెస్తే ఏమన్నారో తెలుసా…!

Sreenu : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ప్రస్తుత కాలంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది ఆర్టిస్టులను కూడా మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా కమెడియన్ ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అయితే ప్రభాస్ శ్రీను తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన ప్రతి సినిమాలో ఓ పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. అలా ప్రభాస్ శ్రీను తెలుగు […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 February 2024,12:30 pm

ప్రధానాంశాలు:

  •  Sreenu : నేను వి.వి వినాయక్ కష్టపడి ప్రభాస్ కోసం ఫుడ్ తెస్తే ఏమన్నారో తెలుసా...!

Sreenu : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ప్రస్తుత కాలంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది ఆర్టిస్టులను కూడా మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా కమెడియన్ ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. అయితే ప్రభాస్ శ్రీను తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన ప్రతి సినిమాలో ఓ పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. అలా ప్రభాస్ శ్రీను తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్న నటుడుగా అందరి మననలు పొందాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శ్రీను టాలీవుడ్ స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నా క్యారెక్టర్ లేకపోయినా సరే దర్శకులు ఏరికోరి నన్ను కావాలని సినిమాలో పెట్టేవారని తెలియజేశారు.

మరీ ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్న సమయంలో నాకు డేట్స్ లేకపోయినా సరే కావాలని పిలిపించి మరి ఆ సినిమా దర్శకుడు పెట్టించినట్లుగా ఈ సందర్భంగా ప్రభాస్ శ్రీను తెలియజేశారు. అయితే ప్రభాస్ శ్రీను కొన్ని రోజులు సెట్స్ లోకి రాకపోతే సెట్ అంత బోసిగా కనిపించేదట. ఇక ఈ విషయాన్ని దర్శకులు కూడా చాలా సార్లు చెప్పినట్లుగా ఆయన తెలిపారు. అందుకే తాను సెట్స్ లోకి వెళ్ళినప్పుడు వారితో సరదాగా గడుపుతానని , వారందరిని నవ్విస్తూ ఉంటానని అందుకే చాలామంది నన్ను కావాలని కోరుకుంటారు అంటూ ఆయన తెలిపారు. ఇక ఈ క్రమంలోనే యాంకర్ మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు అని అడగగా ప్రభాస్ శ్రీను సమాధానం ఇస్తూ పరుశురాం గారు, బుజ్జి గారు, రాజమౌళి గారు, మరియు వివి వినాయక్ గారు అని తెలియజేశారు. ఇక వీరితో ప్రభాస్ శ్రీను చాలా సన్నిహితంగా ఉంటారట. వీరిలో వి.వి వినాయక్ గారు ప్రభాస్ శ్రీను కంపెనీ చాలా బాగా ఎంజాయ్ చేసేవారని ఈ సందర్భంగాగా తెలియజేశారు.

ఇక యోగి సినిమా చేసే సమయంలో వారు గుర్తుండిపోయే సందర్భాలను గడిపారని తెలియజేశారు. ఇక ఆ సమయంలో ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుంటే తాను వినయ్ గారు ఖాళీగా ఉండేవారట. ఆ సందర్భంలోనే దగ్గరిలో ఫుడ్ స్టాల్స్ ఏవి లేకపోవడంతో కె.ఎఫ్.సీ కి వెళ్లి స్వయంగా వారే భోజనాలు తీసుకువచ్చి సినీ యూనిట్ కి పెట్టేవారని ప్రభాస్ శీను తెలియజేశారు. ఇక వి.వి వినాయక్ గారు కూర్చుని మాట్లాడటం మొదలుపెడితే చాలా ప్రేమగా పిలుస్తారని ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటారని ఆయన తెలిపారు.అందుకే వి.వి వినాయక్ గారితో మాట్లాడుతుంటే టైం అసలు తెలిసేది కాదని ప్రభాస్ శ్రీను ఈ సందర్భంగా తెలియజేశారు. తాను ఏ సినిమాకు పని చేస్తే ఆ సినిమా డైరెక్టర్ తో చాలా సన్నిహితంగా మెలిగిపోయే వాడినని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ శ్రీను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది