Sri Leela : 55 ఏళ్ల హీరోతో శ్రీలీల రొమాన్స్.. ఇదేం కర్మరా బాబు అంటున్న నెటిజన్స్!

Authored By mallesh | The Telugu News | Published on: September 2, 2022, 4:00 pm

Sri Leela : టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు కుర్ర హీరోయిన్లతో రొమాన్స్ చేయడం అనేది రోటిన్ అయిపోయింది.ఎందుకంటే చాలా సినీ పరిశ్రమల్లో ఇది జరుగుతూ ఉంటుంది. బాలీవుడ్, టాలీవుడ్ అని కాకుండా అన్ని భాషల్లోనూ కామన్ అయిపోయింది. ఒకప్పుడు రజినీ కాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ ఇలా వీళ్లంతా చిన్న హీరోయిన్లతో రొమాన్స్ చేసిన వారే. చిరంజీవి తాజాగా తమన్నాతో చేస్తుండగా.. బాలయ్య బాబు గతంలో సింహా సినిమాలో స్నేహ ఉల్లాల్‌తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. వీరికి ఏజ్ గ్యాప్ 30 పైనే ఉంటుంది.

Sri Leela : సీనియర్ హీరోతో కుర్ర హీరోయిన్ జోడి

శ్రీకాంత్ తనయుడు రోశన్ హీరోగా నటించిన ‘పెళ్లిసండD’ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా పరువాలేదని పించింది. 20 ఏళ్ల శ్రీలల ఏకంగా 55 ఏళ్ల రవితేజతో కొత్త సినిమా చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కుర్ర హీరోయిన అయిన శ్రీలీల రవితేజతో సినిమా చేసేందుకు ఎందుకు ఓకే చెప్పిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే చేసిన ఒక్కసినిమాతోనే పెద్దహీరోతో నటించే చాన్స్ కొట్టేసిందని..

Sri Leela Romance With The 55 Year Old Hero Netizens Comments

Sri Leela Romance With The 55 Year Old Hero Netizens Comments

శ్రీలీల లక్కీ అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే రవితేజ తనకంటే 35 ఏళ్లు పెద్ద అని తండ్రి వయస్సున్న వ్యక్తితో సినిమాలో రొమాన్స్ ఎలా చేస్తుందని అనే వాళ్లు కూడా లేకపోలేదు. ఇక రవితేజ గ్రాఫ్ క్రమంగా పడిపోతుంది. క్రాక్ సినిమా ముందు.. ఆ తర్వాత మనోడికి అన్ని ప్లాపులే.. ఇటీవల వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.అయితే, అతనితో నటిస్తే శ్రీలీల ఫ్యూచర్ దెబ్బతినే చాన్స్ ఉందని అనేవారు లేకపోలేదు. ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ అయితే అవకాశాలు కూడా తగ్గిపోతాయని అంటున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp