Sri Reddy : ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం చాలా వాడివేడిగా సాగుతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకవైపు జగన్ మరో వైపు ఎన్నికల ప్రచారంతో హీటు పెంచుతున్నారు. అయితే విజయవాడలో ప్రచార కార్యక్రమం సమయంలో సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ దాడి జరగడంతో రాబోయే రోజుల్లో ఆయన భద్రత విషయంలో పలు కీలక మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం గుత్తిలో జగన్ కాన్వాయ్‌పై కొందరు చెప్పులు విసిరారు. ఇప్పుడు జగన్‌పై రాయి విసరడం.. ఈ ఘటనలో ఆయన గాయపడటంతో నిఘా విభాగం హైఅలర్ట్ చేసింది. జగన్‌కి గాయం జరగడం పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు.
అయితే వైసీపీ విధేయురాలిగా ఉన్న శ్రీ రెడ్డి జగన్‌పై రాళ్ల దాడి గురించి తన ఫేస్ బుక్ వేదికగా షాకింగ్ పోస్ట్ చేసింది. సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ ఇలాంటి నీచమైన పనులకి తెగబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ దాడి వెనక టీడీపీ బోండా ఉమ ఉన్నట్టుగా శ్రీరెడ్డి పేర్కొంది. ఎన్నో కోట్లమందికి ప్రాణమైన వ్యక్తిపై హత్యా యత్నం చేస్తారా? అసలు మీరంతా మనుషులేనా? ఒక మనిషికి హాని తలపెట్టేంత కోపం మీకు ఎందుకు. ఇంతమంది జనం వస్తున్నారని జీర్ణించుకోలేక ఇలాంటి పని చేస్తారా? జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు బతుకుతున్నాయో మీకు ఎమైన అర్ధం అవుతుందా? మీ పదవుల కోసం జగనన్నకి హాని తలపెడతారా.. మేమంతా ఆయనపైనే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాం అని ఎమోషనల్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి.
వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికి శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో జగన్ పిక్ షేర్ చేస్తూ.. “నేను చచ్చిపోతాను జగనన్నా ,నేను బ్రతకలేను, మీరంటే అంత పిచ్చి, ప్రాణం ..రాత్రంతా నిద్ర కూడా లేదు అన్న” అంటూ జగన్ దాడి ఘటన ఫొటోను షేర్ చేసింది శ్రీరెడ్డి. ఇప్పటికే ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుంది పోలీస్ శాఖ. అయితే ఒక ముఖ్యమంత్రిపైనే ఇలా దాడి జరగడం నేషనల్ వైడ్‌గా సంచలనం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేస్తుండడం విశేషం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నాయి.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.