Home » Entertainment » Sri Reddy Chicken Curry Video
Entertainment

Sri Reddy : బావ కోసం కోడి కూర వండిన శ్రీరెడ్డి.. నోరూరించేస్తుందిగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 4, 2022, 1:34 pm
Advertisement

Sri Reddy : శ్రీ రెడ్డి.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కి శ్రీరెడ్డి పేరు చెబితే ఇట్టే గుర్తు ప‌డుతుంటారు. హీరోయిన్‌ అవ్వాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన శ్రీరెడ్డి.. ఆరంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా వర్క్ చేసింది. అలా చాలా మంది దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ‘నేను నాన్న అబద్ధం’ అనే సినిమాతో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ‘అరవింద్ 2’, ‘జిందగీ’ వంటి వాటిలో నటించింది. ఆ తర్వాత వెండితెరకు దూరమైపోయింది.మీటూ అంటూ నానా ర‌చ్చ చేసి హంగామా సృష్టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత మ‌కాం చెన్నైకి షిఫ్ట్ చేసింది .

Advertisement

శ్రీరెడ్డి సోషల్ మీడియా వల్లే పాపులర్ అయిందన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఈ భామ తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్‌లో ఈ హాట్ హీరోయిన్ సెన్సేషన్‌గా మారిపోయింది.ఇటీవ‌ల శ్రీ రెడ్డి యూట్యూబ్ ద్వారా నానా ర‌చ్చ చేస్తుంది. వెరైటీ వంట‌కాలు వ‌డ్డిస్తూ నోరూరిస్తుంది. ఈ మధ్య శ్రీ రెడ్డి పీతలు, రొయ్యలు, ఎండుచేపలు వంటి పల్లెటూరి వంటలు చేసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంది.. ఇటీవలే చెరువులో పట్టిన బంగారుతీగ చేప పులుసు చేసింది. ఆ తరువాత మేక తొడ కూర వండింది.

sri reddy chicken curry video

Advertisement

Sri Reddy : శ్రీ రెడ్డి కోడి కూర‌..

అనంతరం గుమగుమలాడే నాటు కూర, కోడిగుడ్ల పులుసు కూడా చేసింది. సముద్ర తీరాన చేపల కూర విందు తో పాటు కుర్రాళ్లకు అందాల విందు కూడా ఇచ్చింది. కడకనాథ్ కోడి కూర వండిన వీడియోను షేర్ చేసింది. దాంతోపాటు మగాళ్ల ఒంట్లో కరెంట్ తగ్గిపోతే ఈ కూర వయాగ్రా లా పని చేస్తుందని బోల్డ్ మాటలు చెప్పింది.ఇక ఇప్పుడు బావ కోసం కోడి కూర వండానంటూ మంచి రోస్ట్ చేసింది. ఇందులో కోడిని ఫ్రై చేసి నోరూరించే విధంగా త‌యారు చేసింది. వెన్నెలో కోడిని అంచుకుంటూ తింటుంటే నెటిజ‌న్స్ మ‌తులు పోతుంది. అంతేకాదు మీటూ మాదిరిగానే ప‌లువురు అబ్బాయిలు ప‌డ‌తున్న బాధ‌లు కూడా ఇందులో ప్ర‌స్తావించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి