Home » Entertainment » Sridevi Drama Company Latest Episode Promo
Entertainment

Sridevi Drama Company : ఓరి మీదుంప తెగ… శ్రీదేవి డ్రామా కంపెనీనా? పెళ్లిల్లు చేసే కంపెనీనా?

Authored By
aruna
The Telugu News | Published on: April 8, 2022, 2:30 pm
Advertisement

Sridevi Drama Company : ఈటీవీ అదృష్టం ఏమో కానీ 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన జబర్దస్త్ కార్యక్రమం సూపర్ హిట్ అయింది. జబర్దస్త్ నుండి పుట్టు కొచ్చిన ఎన్నో కార్యక్రమాలు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. జబర్దస్త్ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది. మరో వైపు జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇతర కామెడీ కార్యక్రమాలు ఈ టీవీలో ప్రసారం అవుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకుని సదరు టెలివిజన్ కి మంచి రేటింగ్ను తెచ్చి పెడుతున్నాయి. జబర్దస్త్ ఇతర కార్యక్రమాలు లేకుంటే ఈ టీవీ ఛానల్ ని ఎప్పుడో ప్రేక్షకులు పక్కకు పెట్టేవారు అనడంలో సందేహం లేదు.

Advertisement

కేవలం జబర్దస్త్ మరియు ఇతర కామెడీ కార్యక్రమాలతో ఛానల్ నడుస్తోంది. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు ప్రతి ఒక్క కామెడీ కార్యక్రమాల పై సదరు చానల్ వారు చాలా దృష్టి పెడుతున్నారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ లో పదే పదే సేమ్ కాన్సెప్టులతో కామెడీ చేసే ప్రయత్నాలు చేయడంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య సుధీర్ పెళ్లి అంటూ ఓ హడావుడి చేసేసి పెద్దగా ప్రమోషన్ చేసి కార్యక్రమాన్ని హిట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్లీ ఒక పెళ్ళితో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

Sridevi Drama Company latest episode promo

Advertisement

బుల్లెట్ భాస్కర్ తండ్రి పెళ్లిని శ్రీదేవి డ్రామా కంపెనీ లో చేయబోతున్నట్లుగా వచ్చే ఆదివారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఆ ప్రోమో లో బుల్లెట్ భాస్కర్ తండ్రి ఒక్కొక్కరిపై వేస్తున్న పంచ్‌ లు చూస్తుంటే కార్యక్రమం బాగానే ఉంటుంది అనిపిస్తుంది. కానీ మళ్లీ పెళ్లి కాన్సెప్ట్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ముసలాయనకు పెళ్లి ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. మా నాన్నకు పెళ్లి అంటూ రాబోతున్న ఈ ప్రత్యేక శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. కాన్సెప్టు ఏదైనా ఆది మరియు రాంప్రసాద్ తమదైన శైలిలో కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తారని నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి