Srikanth Iyengar : టాలీవుడ్ మ‌రో న‌రేష్ – ప‌విత్రా లోకేష్ జంట‌.. ఆ జంట ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వుతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Srikanth Iyengar : టాలీవుడ్ మ‌రో న‌రేష్ – ప‌విత్రా లోకేష్ జంట‌.. ఆ జంట ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వుతారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 November 2024,8:05 pm

ప్రధానాంశాలు:

  •  Srikanth Iyengar : టాలీవుడ్ మ‌రో న‌రేష్ - ప‌విత్రా లోకేష్ జంట‌.. ఆ జంట ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వుతారు..!

Srikanth Iyengar : టాలీవుడ్‌లో Tollywood  న‌రేష్‌- పవిత్రా లోకేష్ జంట‌కి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ జంట కొన్నాళ్లుగా త‌ర‌చూ వార్త‌ల‌లో నిలుస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉన్నారు. నడివయసులో ప్రేమించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, కొత్తగా ప్రేమలో ఉన్న యువతీ యువకుల్లా ప్రవర్తించడం, నరేష్ మూడో భార్యతో వివాదం, కోర్టులో కేసులు… ఇలాంటి సంఘటలన్నీ వారి పేరు మారుమ్రోగేలా చేశాయి.ఇప్పుడు ఈ జంట మాదిరిగానే టాలీవుడ్‌లో మ‌రో క్రేజీ జంట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారబోతుంది. మ‌రి ఆ జంట ఎవ‌రో కాదు న‌టుడు శ్రీకాంత్ అయ్యంగార్, న‌టి జ్యోతి.

Srikanth Iyengar మ‌రో క్రేజీ జంట‌..

ప్ర‌ముఖ న‌టుడు శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్ లేటు వ‌య‌సులో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు. అవును, శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప‌లు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ మరియు వ్యాంప్ రోల్స్ లో నటించి పాపులర్ అయిన న‌టి జ్యోతితో త‌న పెళ్లి ఫిక్స్ అయిన‌ట్లు శ్రీ‌కాంత్ సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా హింట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో శ్రీ‌కాంత్ అయ్యంగ‌ర్ ఒక‌రు. రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన క‌రోనా వైర‌స్ మూవీతో శ్రీ‌కాంత్ బాగా ఫేమ‌స్ అయ్యారు. గత కొద్దిరోజులుగా పలు వివాదాస్పద పోస్ట్ లు, కామెంట్లు, బహిరంగ వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు కూడా.

Srikanth Iyengar టాలీవుడ్ మ‌రో న‌రేష్ ప‌విత్రా లోకేష్ జంట‌ ఆ జంట ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వుతారు

Srikanth Iyengar : టాలీవుడ్ మ‌రో న‌రేష్ – ప‌విత్రా లోకేష్ జంట‌.. ఆ జంట ఎవ‌రో తెలిస్తే అవాక్క‌వుతారు..!

ఇక ఇటీవల జర్నలిస్ట్ లను బూతులు తిడుతూ బహిరంగంగా చేసిన కామెంట్లకు జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతూ.. ఈయనపై చర్యలు తీసుకోవాలని మా కి కూడా లేఖలు పంపిన విషయం తెలిసిందే.. దీంతో దిగివచ్చిన శ్రీకాంత్ అయ్యంగర్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ఇలా నిత్యం వార్తల్లో నిలిచే ఈయన ఇప్పుడు మరొకసారి పెళ్లి వార్తల్లో నిలవడం ఆశ్చర్యంగా మారింది. శ్రీకాంత్.. తనకు నటి జ్యోతి ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేశారు.” క్రష్ ఆఫ్ మై లైఫ్.. మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా?” అంటూ రాసుకు వచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉండగా.. శ్రీకాంత్ ఒక్క ఫోటోతో కన్ఫర్మ్ చేసేసారు.. ఇంకా పెళ్లి ఒకటే వాయిదా అంటూ కామెంట్లు చేస్తున్నారు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది