Srikanth : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ puneeth rajkumar మరణం పట్ల యావత్ భారత సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయకపోయినప్పటికీ ఇక్కడి దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరితో పునీత్‌కు సత్సంబంధాలున్నాయి. ఈ నేఫథ్యంలో పునీత్ మరణవార్త తెలుసుకుని టాలీవుడ్ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. పలువురు హీరోలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకుగాను వెంకటేశ్, చిరంజీవితో కలిసి శ్రీకాంత్ బెంగళూరుకు వెళ్లారు. నివాళి అర్పించిన అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడారు. తాను పునీత్ రాజ్ కుమార్ చనిపోయాడంటే నమ్మడం లేదని అన్నాడు. ఇటీవల పునీత్‌తో తాను ‘జేమ్స్’ అనే ఫిల్మ్‌లో నటించానని, దాదాపు 40 రోజులు ఆయనతో ట్రావెల్ చేశానని, చాలా మంచి వ్యక్తని, పునీత్ వాళ్ల ఫ్యామిలీ తనకు బాగా తెలుసని పేర్కన్నాడు.
పునీత్, తాను కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నామని, ఇంతలోనే ఆయన మరణవార్త విని షాక్ అయ్యానని అన్నాడు. పునీత్ ఫ్రెండ్స్ అందరూ తనకు తెలుసని, వారందరికీ ఏ అవసరమున్నా పునీత్ దగ్గరుండి చేస్తాడని వివరించాడు. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు హీరో శ్రీకాంత్. ‘జేమ్స్’ మూవీలో పునీత్ రాజ్ కుమార్ బాడీ బిల్డర్ రోల్ ప్లే చేశాడని పేర్కొన్నాడు. ఆ సినిమాలో తాను విలన్ రోల్ ప్లే చేశానని, షూటింగ్ టైంలో పునీత్ తన కోసం ఇంటి నుంచి భోజనం తెప్పించాడని గుర్తు చేసుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ జిమ్ వర్కవుట్ వల్లే చనిపోయాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ అన్నాడు.
పునీత్ వాళ్ల ఫ్యామిలీలో గుండెపోటు చనిపోవడం అనేది ఉందని, పునీత్ ఫాదర్ రాజ్ కుమార్ హార్ట్ అటాక్‌తో చనిపోయారని, శివ రాజ్ కుమార్‌కు ఒకసారి గుండెపోటు వచ్చిందని, ఈ క్రమంలోనే పునీత్‌కు గుండెపోటు వచ్చి చనిపోయాడని శ్రీకాంత్ పేర్కొన్నాడు. పునీత్ సడెన్ స్ట్రోక్ వచ్చిందని, అందుకే ఆయన చనిపోయాడంటూ వివరించాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.