Srikanth : పునీత్ రాజ్ కుమార్ ఆ కారణం వల్లే చనిపోయాడంటున్న శ్రీకాంత్..

Authored By mallesh | The Telugu News | Published on: October 31, 2021, 9:00 pm

Srikanth : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ puneeth rajkumar మరణం పట్ల యావత్ భారత సినీ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయకపోయినప్పటికీ ఇక్కడి దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరితో పునీత్‌కు సత్సంబంధాలున్నాయి. ఈ నేఫథ్యంలో పునీత్ మరణవార్త తెలుసుకుని టాలీవుడ్ సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. పలువురు హీరోలు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకుగాను వెంకటేశ్, చిరంజీవితో కలిసి శ్రీకాంత్ బెంగళూరుకు వెళ్లారు. నివాళి అర్పించిన అనంతరం హీరో శ్రీకాంత్ మాట్లాడారు. తాను పునీత్ రాజ్ కుమార్ చనిపోయాడంటే నమ్మడం లేదని అన్నాడు. ఇటీవల పునీత్‌తో తాను ‘జేమ్స్’ అనే ఫిల్మ్‌లో నటించానని, దాదాపు 40 రోజులు ఆయనతో ట్రావెల్ చేశానని, చాలా మంచి వ్యక్తని, పునీత్ వాళ్ల ఫ్యామిలీ తనకు బాగా తెలుసని పేర్కన్నాడు.

srikanth told the reason behind death of punith rajkumar

srikanth told the reason behind death of punith rajkumar

పునీత్, తాను కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నామని, ఇంతలోనే ఆయన మరణవార్త విని షాక్ అయ్యానని అన్నాడు. పునీత్ ఫ్రెండ్స్ అందరూ తనకు తెలుసని, వారందరికీ ఏ అవసరమున్నా పునీత్ దగ్గరుండి చేస్తాడని వివరించాడు. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరన్న వార్తను తాను జీర్ణించుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశాడు హీరో శ్రీకాంత్. ‘జేమ్స్’ మూవీలో పునీత్ రాజ్ కుమార్ బాడీ బిల్డర్ రోల్ ప్లే చేశాడని పేర్కొన్నాడు. ఆ సినిమాలో తాను విలన్ రోల్ ప్లే చేశానని, షూటింగ్ టైంలో పునీత్ తన కోసం ఇంటి నుంచి భోజనం తెప్పించాడని గుర్తు చేసుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ జిమ్ వర్కవుట్ వల్లే చనిపోయాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ అన్నాడు.

Srikanth : పునీత్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అన్న శ్రీకాంత్

srikanth told the reason behind death of punith rajkumar

srikanth told the reason behind death of punith rajkumar

పునీత్ వాళ్ల ఫ్యామిలీలో గుండెపోటు చనిపోవడం అనేది ఉందని, పునీత్ ఫాదర్ రాజ్ కుమార్ హార్ట్ అటాక్‌తో చనిపోయారని, శివ రాజ్ కుమార్‌కు ఒకసారి గుండెపోటు వచ్చిందని, ఈ క్రమంలోనే పునీత్‌కు గుండెపోటు వచ్చి చనిపోయాడని శ్రీకాంత్ పేర్కొన్నాడు. పునీత్ సడెన్ స్ట్రోక్ వచ్చిందని, అందుకే ఆయన చనిపోయాడంటూ వివరించాడు.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp