Srikanth : ఊహ‌తో ప్రేమ అలా మొద‌ల‌యింది.. వాళ్ల ఇంటికి వెళ్లి అలా చేశాన‌న్న శ్రీకాంత్‌..!

Srikanth.. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో మైటీస్టార్ గా వెలుగొందిన శ్రీకాంత్ గురించి పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కొన్ని వంద‌ల సినిమాల్లో ఆయ‌న న‌టించారు. ఒక‌ప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఆయ‌నకు ఉన్నంత క్రేజ్ మ‌రెవ‌రికీ ఉండేది కాదు. అంతలా ఆయ‌న మెస్మరైజ్ చేసేవారు. అయితే ఆయ హీరోయిన్ ఊహ‌ను పెండ్లి చేసుకున్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. అయితే వీరి ప్రేమ ఎలా మొద‌లైంది, ఎవ‌రు ముందు ప్ర‌పోజ్ చేశారు అనే అంశాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా శ్రీకాంత్ ఓ మీడియాతో ఛానెల్ లో మాట్లాడుతూ త‌న వ్య‌క్తిగ‌త వివరాల‌ను వెల్ల‌డించారు. ఇందులో ఊహ‌తో త‌న పెళ్లి ఎలా జ‌రిగింది, త‌మ ప్ర‌యాణం ఎలా జ‌రిగింది లాంటి అనేక విష‌యాల‌ను ఆయ‌న వివ‌రించారు. ఇండస్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు తనను ఎవరూ ఇబ్బంది పెట్ట‌లేద‌ని, త‌న క‌ష్టాన్ని న‌మ్ముకుని పైకి వ‌చ్చానంటూ చెప్పుకొచ్చారు శ్రీకాంత్‌. ఇక త‌న క్రికెట్ గ్యాంగ్ అయిన శివాజీ రాజా అలాగే తరుణ్ ఇప్ప‌టికీ మంచి స్నేహితుల‌మే అంటూ చెప్పుకొచ్చారు. తామంతా షూటింగ్ లొకేషన్స్‌లో ఎప్పుడూ న‌వ్వుతూ ఉంటామ‌ని వివ‌రించారు.

Srikanth Uha in love began like that

Srikanth : వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడా..

ఇక ఊహ‌తో సినిమాల ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డిందని, త‌న ఇంట్లో జ‌రిగే అనేక ఫంక్ష‌న్ల‌కు ఆమె వ‌చ్చేద‌ని అలా త‌మ మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని చెప్పుకొచ్చారు. ఇక ప్రేమ మొద‌ల‌యిన త‌ర్వాత మాత్రం తాను ముందుగా ప్ర‌పోజ్ చేసిన‌ట్టు వివ‌రించారు శ్రీకాంత్‌. ఇక త‌న ప్రేమ‌ను ఊహ కూడా ఈజీగానే ఓకే చెప్పేయ‌డంతోవాళ్ళింటికి తానే స్వ‌యంగా వెళ్లి మాట్లాడాన‌ని వివ‌రించారు. ఇక సినిమాల్లో త‌ప్ప మ‌రే బిజినెస్ లోకి తాను ఎంట్రీ ఇవ్వ‌లేద‌ని, సినిమా మాత్ర‌మే త‌న ప్ర‌పంచం అంటూ చెప్పుకొచ్చారు. ఇక వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు అయిన రోష‌న్ ఇప్ప‌టికే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు.

Recent Posts

Knee Pain | తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయొద్దు .. వైద్య నిపుణుల హెచ్చరిక

Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…

35 minutes ago

Curry Leaf Plant| కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో ఈ త‌ప్పులు చేస్తే స‌మ‌స్య‌లు తప్పవు..!

Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…

2 hours ago

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

11 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

12 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

14 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

16 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

18 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

20 hours ago