Srikanth : ఊహతో ప్రేమ అలా మొదలయింది.. వాళ్ల ఇంటికి వెళ్లి అలా చేశానన్న శ్రీకాంత్..!
Srikanth.. ఒకప్పుడు టాలీవుడ్‌లో మైటీస్టార్ గా వెలుగొందిన శ్రీకాంత్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కొన్ని వందల సినిమాల్లో ఆయన నటించారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఆయనకు ఉన్నంత క్రేజ్ మరెవరికీ ఉండేది కాదు. అంతలా ఆయన మెస్మరైజ్ చేసేవారు. అయితే ఆయ హీరోయిన్ ఊహను పెండ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీరి ప్రేమ ఎలా మొదలైంది, ఎవరు ముందు ప్రపోజ్ చేశారు అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తాజాగా శ్రీకాంత్ ఓ మీడియాతో ఛానెల్ లో మాట్లాడుతూ తన వ్యక్తిగత వివరాలను వెల్లడించారు. ఇందులో ఊహతో తన పెళ్లి ఎలా జరిగింది, తమ ప్రయాణం ఎలా జరిగింది లాంటి అనేక విషయాలను ఆయన వివరించారు. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు తనను ఎవరూ ఇబ్బంది పెట్టలేదని, తన కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చానంటూ చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ఇక తన క్రికెట్ గ్యాంగ్ అయిన శివాజీ రాజా అలాగే తరుణ్ ఇప్పటికీ మంచి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చారు. తామంతా షూటింగ్ లొకేషన్స్‌లో ఎప్పుడూ నవ్వుతూ ఉంటామని వివరించారు.

Srikanth Uha in love began like that
Srikanth : వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడా..
ఇక ఊహతో సినిమాల ద్వారా పరిచయం ఏర్పడిందని, తన ఇంట్లో జరిగే అనేక ఫంక్షన్లకు ఆమె వచ్చేదని అలా తమ మధ్య ప్రేమ చిగురించిందని చెప్పుకొచ్చారు. ఇక ప్రేమ మొదలయిన తర్వాత మాత్రం తాను ముందుగా ప్రపోజ్ చేసినట్టు వివరించారు శ్రీకాంత్. ఇక తన ప్రేమను ఊహ కూడా ఈజీగానే ఓకే చెప్పేయడంతోవాళ్ళింటికి తానే స్వయంగా వెళ్లి మాట్లాడానని వివరించారు. ఇక సినిమాల్లో తప్ప మరే బిజినెస్ లోకి తాను ఎంట్రీ ఇవ్వలేదని, సినిమా మాత్రమే తన ప్రపంచం అంటూ చెప్పుకొచ్చారు. ఇక వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు అయిన రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు.