Viral video : నిజంగా పెళ్ళాన్ని అడిగినట్లు అడిగారు .. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on: March 2, 2026, 7:47 pm
  •  Viral video : నిజంగా పెళ్ళాన్ని అడిగినట్లు అడిగారు .. కాలేజీ కుర్రాళ్లతో శ్రీలీల సందడి ..!

Viral video : టాలీవుడ్‌లో Tollywood కిసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల Sreeleela తన అందంతోనే కాదు, అద్భుతమైన నటన, ఎనర్జీతో నిండిన డ్యాన్స్ స్టెప్పులతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. హీరోలకు ఏమాత్రం తగ్గకుండా స్టెప్పులు వేస్తూ యూత్ హార్ట్‌థ్రోబ్‌గా నిలుస్తోంది. 2019లో కన్నడ చిత్రం కిస్ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె, తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడితో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

ఆ తర్వాత ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. అంతేకాకుండా పుష్ప 2: ది రూల్లో ‘కిస్ కిస్సిక్’ ఐటెం సాంగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది.

Viral video : నిజంగా పెళ్ళాన్ని అడిగినట్లు అడిగారు .. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు..!

Viral video : నిజంగా పెళ్ళాన్ని అడిగినట్లు అడిగారు .. శ్రీలీల సంచలన వ్యాఖ్యలు..!

ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన జూబిలేషన్ ఫెస్ట్‌లో ఆమె పాల్గొన్నారు. స్టూడెంట్స్‌తో ముచ్చటిస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది. “మీ జోష్ చూసి అరుస్తూ గొంతు పోయింది” అంటూ సరదాగా చెప్పి అందరినీ నవ్వించింది. డ్యాన్స్ చేయాలని స్టూడెంట్స్ కోరగా, “పెళ్లాన్ని అడిగినట్టు అడిగారు … డ్యాన్స్ చేద్దాం, కమాన్!” అంటూ హుషారుగా స్పందించింది. దీంతో అక్కడున్న యువత కేరింతలతో మార్మోగింది. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp