Home » Entertainment » Srinu Given Clarity On Hero Prabhas Marriage
Entertainment

Prabhas : ప్రభాస్ మ్యారేజ్‌పై క్లారిటీనిచ్చిన ఆయన ఫ్రెండ్ ప్రభాస్ శ్రీను..!

Authored By
mallesh
The Telugu News | Published on: January 10, 2022, 6:10 pm
Advertisement

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అన్న సంగతి అందరికీ విదితమే. డార్లింగ్ ప్రభాస్.. పెళ్లి గురించి చాలా కాలం నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో బోలెడన్ని వార్తలొస్తున్నాయి. అయితే, వాటిలో అనుష్కతో ప్రభాస్ పెళ్లి అనే వార్తలు కూడా ఉన్నాయి. కానీ, ఆయా వార్తలపై ప్రభాస్ ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. తాజాగా ప్రభాస్ మ్యారేజ్‌పై ఆయన ఫ్రెండ్ ప్రభాస్ శ్రీను చేసిన కామెంట్స్ తెలుసుకుందాం.ప్రభాస్ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాగా, వాటి షూటింగ్స్ బిజీలో ప్రభాస్ ఉన్నాడు.

Advertisement

ఈ క్రమంలోనే చాలా సార్లు మీడియా ప్రతినిధులు పెళ్లి ఎప్పుడునే ప్రశ్నను ప్రభాస్ కు అడుగుతుంటారు. కాగా, ప్రతీ సారి ప్రభాస్ ఆ విషయం దాటవేస్తుంటారు. తాజాగా ప్రభాస్ పెళ్లి విషయమై ఆయన సన్నిహితుడు, స్నేహితుడు ప్రభాస్ శ్రీను స్పందించాడు. ఇదే ప్రశ్నను చాలా మంది వేస్తుంటారని, అయితే, తాను చెప్పినా, ఇంకెవరు చెప్పినా ప్రభాస్ పెళ్లి కాదని, ఆ సమయం వచ్చినపుడు అవుతుందని శ్రీను అన్నాడు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం ఆ విషయం తెలుస్తుందని ప్రభాస్ శ్రీను అన్నాడు.

Srinu given clarity on Hero prabhas marriage

Advertisement

Prabhas : ప్రభాస్ పెళ్లి వార్త కోసమై ఫ్యాన్స్ వెయిటింగ్..

ఇకపోతే ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న విడుదల కావాల్సి ఉంది. కానీ, కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో చిత్ర విడుదల వాయిదా పడింది. ఇకపోతే ప్రభాస్ లైనప్ మూవీస్ క్రేజీగా ఉన్నాయి. ‘రాధేశ్యామ్’ సినిమా తర్వాత ఆయన నటించే ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్’ విడుదల అవుతాయి. మొత్తంగా ప్రభాస్ లైనప్ ఫిల్మ్స్ అయితే చాలా క్రేజీగా ఉండగా, వాటి కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
‘రాధే శ్యామ్’ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా బ్యూటిఫుల్ పూజా హెగ్డే నటించింది. ఇందులో కీలక పాత్రను ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు పోషించారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి