Superstar Krishna – Indira Devi : కృష్ణ రెండో పెళ్లి విషయంలో.. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవికి తెలియకుండా తెర వెనుక పెద్ద మోసం చేసిన టాప్ హీరో?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 16, 2022, 1:00 pm

Superstar Krishna – Indira Devi  :  సూపర్ స్టార్ కృష్ణ ఒక లెజండ్. ఆయన చనిపోయి ఒక్క రోజు అయినా కూడా ఆయన అభిమానులు ఇంకా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ ఇండస్ట్రీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కూడా లేవు. ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. సూపర్ స్టార్ కృష్ణ.. సినీ ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టించిన నటుడు. ఆయన పేరు మీద ఉన్న రికార్డులు మరే హీరోకు లేవు. అది ఆయన సత్తా. అందుకే ఆయన ఒక లెజండ్ గా నిలిచిపోయారు. ఇక.. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి. మరోవైపు కృష్ణకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో ఒకటి కృష్ణ, విజయనిర్మల పెళ్లి. ఎందుకంటే.. అప్పటికే పెళ్లి అయి పిల్లలను కన్న తర్వాత కృష్ణ.. విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్నారు. అయితే.. వాళ్ల పెళ్లి అంత ఈజీగా ఏం జరగలేదట. సినిమా స్టోరీని తలపించేలా వాళ్ల పెళ్లి విషయంలో చాలా ట్విస్టులు ఉన్నాయట. ఎందుకంటే.. విజయనిర్మలకు అప్పటికే కృష్ణమూర్తి అనే వ్యక్తితో పెళ్లి అయింది. ఒక కొడుకు కూడా పుట్టాడు. అతడే నరేష్. అప్పటికీ విజయనిర్మల ఇంకా సినిమాల్లోకి రాలేదు. పెళ్లి తర్వాత సినిమాల్లోకి రావాలని విజయనిర్మల కలలు కన్నది. కానీ.. కృష్ణమూర్తికి అది నచ్చలేదు. విజయనిర్మల సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. అయినా కూడా ఆమె సినిమాల్లోకి వెళ్లారు. కృష్ణతో ఎక్కువ సినిమాలు చేయడంతో వాళ్ల మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో అది పెళ్లి వరకు వచ్చింది.

star hero helped to superstar krishna to marry vijaya nirmala

star hero helped to superstar krishna to marry vijaya nirmala

Superstar Krishna – Indira Devi : కృష్ణ, విజయనిర్మల పెళ్లికి సహకరించిన చంద్రమోహన్

చంద్రమోహన్ మొదటి నుంచి విజయనిర్మలకు చాలా ఆప్తుడిగా ఉండేవారు. ఆయనే వీళ్ల పెళ్లికి సహకరించారు. చాలామంది సన్నిహితులే వాళ్ల పెళ్లికి మద్దతు ఇవ్వకున్నా.. చంద్రమోహన్ వాళ్ల పెళ్లికి సహకరించారు. చంద్రమోహన్ ను విజయనిర్మల దగ్గరికి మధ్యవర్తిత్వం కోసం పంపించారట. కృష్ణ తరుపున వెళ్లి చంద్రమోహన్ అడిగారట. దీంతో ఒకవేళ ఆయనకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంటే నన్నే వచ్చి డైరెక్ట్ గా అడగమనండి అని చంద్రమోహన్ కు చెప్పిందట విజయనిర్మల. దీంతో కృష్ణ నేరుగా వెళ్లి విజయనిర్మలను అడిగారట. దీంతో విజయనిర్మల వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. చంద్రమోహన్ మళ్లీ దగ్గరుండి వాళ్ల పెళ్లిని సీక్రెట్ గా జరిపించారట. తిరుపతిలో స్వామి వారి సన్నిధిలో కృష్ణ, విజయనిర్మల పెళ్లి జరిగింది. ఈ విషయం తన మొదటి భార్య ఇందిరా దేవికి ముందే చెప్పి ఆమె పర్మిషన్ తీసుకొని విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు.

Also read

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp