JR NTR : సంచ‌ల‌నం.. జూనియర్ ఎన్టీఆర్ మూవీలో స్టార్ హీరో.. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

JR NTR : సంచ‌ల‌నం.. జూనియర్ ఎన్టీఆర్ మూవీలో స్టార్ హీరో.. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌..!

JR NTR : ప్రశాంత్ నీల్ ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా కెజిఎఫ్ 2.. ఈ సినిమా కోసం సినీ అభిమానులు గత రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.. కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయ్యాక సాధారణ హీరోగా వున్న యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్స్ గా మారి పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ అంచనాలతో విడుదల అయిన కెజీఎఫ్-2 సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. ఏకంగా 1000 […]

 Authored By mallesh | The Telugu News | Updated on :17 May 2022,5:30 pm

JR NTR : ప్రశాంత్ నీల్ ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా కెజిఎఫ్ 2.. ఈ సినిమా కోసం సినీ అభిమానులు గత రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.. కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయ్యాక సాధారణ హీరోగా వున్న యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్స్ గా మారి పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ అంచనాలతో విడుదల అయిన కెజీఎఫ్-2 సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది. ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరి ఇటు కన్నడ ఇండస్ట్రీ సత్తా చాటాడు నీల్..ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన 30 శాతానికి పైగానే తెరకెక్కించాడు..

ఇక త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాడు..ఈ సినిమా చేస్తూనే తారక్ తో చేసే సినిమాపై కూడా శ్రద్ధ వహిస్తున్నాడు. ఈ సినిమా కన్ఫర్మ్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్రుష్టి అంతా ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా మీదనే ఉంది.. ఎన్టీఆర్ 31వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు..ఈ క్రమంలోఈ తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.. తాజాగా వస్తున్న రూమర్ సమాచారం ఏంటంటే.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం లోకనాయకుడు కమల్ హాసన్ ను నటింప చేయాలనీ నీల్ అనుకుంటున్నాడట..

star hero in JR NTR movie bollywood crazy heroine

star hero in JR NTR movie bollywood crazy heroine

JR NTR : కీలక పాత్ర కోసం లోకనాయకుడు..

ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె ను ఎంపిక చేశారట.ఇప్పటికే ఈ సినిమాపై చర్చలు కూడా పూర్తి అయ్యాయట.. ఎన్టీఆర్ కు జోడీగా దీపికా నటిస్తుంది అంటేనే ఈ సినిమాను మరో రేంజ్ లో తెరకెక్కించడానికి నీల్ ప్లాన్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.. ఈ సినిమా ను దసరా పండుగ సందర్భంగా గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారట.. ఆ తర్వాత నవంబర్ నుండి రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ చేసి 2024 దసరా సమయానికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది