Star Heroine : కండోమ్ యాడ్‌లో స్టార్ హీరోయిన్ కూతురు.. అలాంటి యాడ్స్ లలో నటించాలంటే ఆమె కరెక్ట్
Star Heroine : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటనతో పాటు గ్లామర్ కారణంగా ఎంతటి ఫాలోయింగ్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2018లో ‘ధడక్’ సినిమాతో హిందీ తెరపై అడుగుపెట్టిన ఆమె, అప్పటి నుంచి రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. తాజాగా ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘దేవర’ ద్వారా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది. ఈ సినిమా విజయం తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలూ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేస్తున్న సినిమా సహా పలువురు స్టార్ హీరోలతో నటించే అవకాశాలు సిద్ధమవుతున్నాయి.
సినిమాలతో పాటు జాన్వీ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, కమర్షియల్ యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్స్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్లను షేర్ చేస్తూ యూత్‌లో సెన్సేషన్‌గా మారిన ఆమె… తాజాగా మరింత డేర్ అండ్ బోల్డ్ అడుగు వేసే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ కండోమ్ బ్రాండ్ ‘మ్యాన్‌ఫోర్స్’ యాడ్ కోసం జాన్వీ కపూర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కంపెనీ ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతోందని సమాచారం.

Star Heroine : కండోమ్ యాడ్‌లో స్టార్ హీరోయిన్ కూతురు.. అలాంటి యాడ్స్ లలో నటించాలంటే ఆమె కరెక్ట్
మ్యాన్‌ఫోర్స్ కంపెనీ ఎండీ రాజీవ్ జునేజా మాట్లాడుతూ, తమ బ్రాండ్‌కు ముఖంగా జాన్వీ కపూర్ బెస్ట్ ఛాయిస్ అని పేర్కొన్నారు. ఆమె గ్లామరస్ లుక్, యూత్‌లో ఉన్న పాపులారిటీ కండోమ్ యాడ్‌కు మరింత హైప్ తెచ్చేలా చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే హీరోలలో రణబీర్ కపూర్‌ను కూడా బెస్ట్ ఫిట్‌గా భావిస్తున్నట్లు చెప్పారు. జాన్వీ వంటి స్టార్‌తో బ్రాండ్ కాంపైన్ చేయడం ద్వారా మరింత ఎక్కువ రీచ్‌ను సాధించగలమని భావిస్తున్నారు. కాగా, ఈ యాడ్ నిజంగానే జరుగుతుందా? లేదంటే ఇది కేవలం ప్రచారమేనా? అనేది త్వరలో క్లారిటీ రానుంది.