Prabhas : ప్ర‌భాస్‌కే కండీష‌న్ పెట్టిన ఈగ విల‌న్..

Authored By Sam C | The Telugu News | Published on: July 28, 2022, 6:20 pm

Prabhas : కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. క‌న్న‌డ‌తో పాటు తెలుగులోను అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు సుదీప్. సుదీప్ నటించిన లేటేస్ట్ చిత్రం విక్రాంత్ రోణ. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూలై 28న థియేటర్లలో గ్రాండ్‏గా రిలీజ్ అయ్యింది. ఉదయం నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుదీప్ త‌న న‌ట‌న‌తో ఎంతో అద‌ర‌గొట్టాడ‌ని చెబుతున్నారు. అయితే చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా సుదీప్ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ప్ర‌భాస్ గురించి మాట్లాడిన సుదీప్ .. ప్రభాస్ చాలా మంచి మనస్సు కలవాడు. నేను అతడిని ఒకసారి కలిశాను. ఇద్ద‌రం క‌లిసి పని చేయ‌డంలో నాకు ఎలాంటి స‌మ‌స్య లేదు. కానీ విలన్ గా మాత్రమే నేను నటించను. నేనెప్పుడూ కథానాయికుడిగానే నటించాను. కేవలం దబాంగ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాను. సల్మాన్ సర్ సినిమాలో విలన్ గా నటించడంలో నేను చాలా సంతోషించాను. కానీ నేనెప్పటికీ అలా ఉండాలనుకోవడం లేదు. ప్రభాస్ కు నాకు మంచి పాత్రలు ఉంటే మల్టీస్టారర్ చేయడానికి నేను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చారు” సుదీప్.

sudeep conditions to prabhas

sudeep conditions to prabhas

Prabhas : విలన్ పాత్ర‌ల‌కు నో..

మ‌రి సుదీప్ ప్ర‌క‌ట‌న‌తో ఏదైన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు రూపొందుతాయా లేదా అనేది చూడాలి. ‘బాహుబలి’లో కూడా సుదీప్ ఒక కీలక పాత్రను పోషించారు. అప్పటి నుంచి రాజమౌళి, సుదీప్ కు మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సుదీప్ చిత్రాన్ని ఐదు భాషల్లో నిర్మించారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. మరోవైపు తన మిత్రుడు సుదీప్ సినిమా విడుదల సందర్భంగా రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రయోగాలు చేయడంలో, సవాళ్లను స్వీకరించడంలో సుదీప్ ఎప్పుడూ ముందుంటాడు. ‘విక్రాంత్ రోణ’ చిత్రంలో ఆయన ఏం చేశాడో చూడాలని ఆత్రుతగా ఉన్నా. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కిచ్చా సుదీప్ కు, మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp