sudigali sudheer and anasuya joining star maa tv they lose big chances
Sudigali Sudheer : ఈటీవీ మల్లెమాల కారణంగా సుడిగాలి సుదీర్ ఇప్పుడు ఒక స్టార్ గా నిలిచాడు. ఒకప్పుడు మ్యాజిక్ చేసుకొని జీవనం గడిపిన సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు అంటే అది కేవలం జబర్దస్త్ కారణంగానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ లో ఒక చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ ఆ తర్వాత అనూహ్యంగా టీం లీడర్ గా ఎదిగి ఎన్నో ఈటీవీ కార్యక్రమాల్లో కనిపించి సందడి చేశాడు. తద్వారా హీరో రేంజ్ లో ఈటీవీ ప్రేక్షకుల్లో గుర్తింపును దక్కించుకున్నాడు. అంత గుర్తింపు వచ్చి సినిమాల్లో వరుసగా నటించింది కూడా జబర్దస్త్ ని సుడిగాలి సుదీర్ వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అనేది అందరికీ తెలిసిందే.. పారితోషికం విషయంలో విభేదాలు తలెత్తడం వల్లే స్టార్ మా ఛానల్ కి ఆయన వెళ్లి పోయాడు అనేది టాక్.
కేవలం సుడిగాలి సుదీర్ మాత్రమే కాకుండా యాంకర్ గా కెరియర్ ని జబర్దస్త్ లోనే ఆరంభించి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న అనసూయ కూడా స్టార్ మా కార్యక్రమానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఈటీవీ మల్లెమాల కార్యక్రమాలను వీడిపోయి రెండు నెలలు అవుతుంది. ఈ సమయంలో వీరిద్దరి యొక్క ఫీలింగ్ ఏంటి అంటూ అభిమానులు సోషల్ మీడియా ద్వారా చర్చించుకుంటున్నారు. ఈటీవీ మరియు మల్లెమాల ఈ రెండు నెలల కాలంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించింది. వాటిల్లో వారిద్దరు లేకపోవడం చాలా లోటుగా ప్రేక్షకులు భావించారు.
sudigali sudheer and anasuya joining star maa tv they lose big chances
వారిద్దరు కూడా ఆ రెండు కార్యక్రమాల్లో నటించకపోవడంతో చాలా నష్టపోయి ఉంటారు. ఇప్పటి వరకు వీరిద్దరూ స్టార్ మా చానల్లో ఏం చేయబోతున్నారు అనే విషయంలో క్లారిటీ లేదు. వరుసగా సినిమాల్లో అయితే నటిస్తున్నారు కానీ వీరు ముందు ముందు బుల్లి తెర ద్వారా ఎలాంటి కార్యక్రమాలను చేస్తారు అనే విషయంలో మాత్రం స్పష్టత ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వారిద్దరు కూడా అనవసరంగా ఈటీవీ మరియు మల్లెమాల సంస్థలను వదిలేశాం అని భావిస్తూ ఉంటారంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఛాన్స్ ఉంటే వారిద్దరూ తిరిగి ఈటీవీ మల్లెమాల కార్యక్రమాల్లో కనిపించేందుకు ఓకే చెబుతారేమో.. కానీ వారికి అవకాశం లేదు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.