Home » Entertainment » Sudigali Sudheer And Rashmi Love Track Again In Jabardast
Entertainment

Sudigali Sudheer : మరచి పోతున్న సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ జోడీని మళ్లీ గుర్తు చేసే ప్రయత్నాలు.. ఫలితం శూన్యం

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 21, 2022, 10:00 pm
Advertisement

Sudigali Sudheer : జబర్దస్త్ ప్రారంభమయి తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయింది. మరికొన్ని నెలల్లో దశాబ్ద కాలం పూర్తి అవుతుంది. ఈ దశాబ్ద కాలంగా జబర్దస్త్ ఎంతో సక్సెస్ఫుల్గా నడుస్తోంది అంటే అందులో కచ్చితంగా యాంకర్ రష్మి మరియు టీం లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య జరిగిన లవ్ అఫైర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరు ఏడు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ షో నిర్వాహకులు చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిద్దరి కాంబినేషన్లో లవ్ ట్రాక్ నడుపుతూ చాలా కామెడీ సన్నివేశాలను ప్రదర్శించే ప్రయత్నాలు కూడా చేశారు.

Advertisement

రష్మీ సుధీర్ కి చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడ్డారు. వారిద్దరి నిజంగా ప్రేమ ఉంటే బాగుండు అని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిద్దరి ప్రేమించుకోవడం లేదని అది కేవలం కామెడీ కోసం కార్యక్రమం కోసం అంటూ తెలిసి చాలా మంది నిరుత్సాహం వ్యక్తం చేశారు. వారిద్దరు ఇప్పటికైనా ప్రేమించుకోవాలి అని కోరుకునే వాళ్ళు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిద్దరినీ కలిపి ఎప్పటికీ సంతోషంగా చూడాలని కోరుకుంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే కొందరు మాత్రం వారిద్దరి లవ్ ట్రాక్ అనేది కేవలం ఫేక్ అని క్లారిటీ వచ్చిన తర్వాత పట్టించుకోవడం మానేశారు.మెజార్టీ జనాలు సుధీర్ రష్మీ ల గురించి పట్టించుకోవడం లేదు.

sudigali sudheer and Rashmi Gautam love track again in jabardast

Advertisement

అయినా కూడా మల్లెమాల వారు జబర్దస్త్ టీం వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఇంకా నడుస్తూనే ఉంది అని చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజా ఎపిసోడ్ లో సుధీర్ వెళ్లి పూర్ణ ను ముద్దు పెట్టుకోవడం కోసం కోసం వెళ్తాడు. ఆ సమయంలో రష్మి స్పందిస్తూ నేను దీనికి ఒప్పుకోవడం లేదు అన్నట్లుగా కన్నీళ్లు పెట్టుకుంది. అంటే సుధీర్ రష్మి కి ఇంకా ప్రేమ ఉంది అని ఈ కార్యక్రమ నిర్వాహకులు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది అంతగా వర్కవుట్ అయినట్లుగా మాత్రం కనిపించ లేదు. కొద్ది శాతం మంది మాత్రం ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని మళ్లీ ఇద్దరూ కలవబోతున్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి