Sudigali Sudheer : దటీజ్ సుడిగాలి సుధీర్.. ఈ రేంజ్ పర్ఫామెన్స్ చూసి చాలా రోజులే అయింది

 Authored By prabhas | The Telugu News | Updated on :6 July 2022,6:00 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు బుల్లితెర మీదున్న పట్టు అందరికీ తెలిసిందే. సింగర్‌గా, హెస్ట్‌గా, యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, మేజీషియన్‌గా ఇలా అన్ని కోణాల్లోనూ అభిమానులున్నారు. అన్ని రకాలుగా మెప్పించగలడు. ఇక ఆయన చేసే యాక్షన్ స్టంట్లు అయితే అందరికీ దిమ్మతిరిగేపోయేలా ఉంటాయి. అలాంటి పర్ఫామెన్స్ చేసి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ల సమయంలో మ్యాజిక్ చేశాడు. భయంకరమైన స్టంట్లు చేశాడు. కాళ్ల మీద నుంచి కార్లు పోనిచ్చుకున్నాడు.. బండలు పగలకొట్టేశాడు. అలా సుధీర్ ఎన్నో రకాలుగా కష్టపడ్డాడు.

ఇక సుధీర్ చేసే మ్యాజిక్ చూసి అందరూ ముచ్చటపడుతుంటాడు. ఇలా అన్ని రగాలు మెప్పిస్తుంటాడ.. మల్టీ టాలెంటెడ్ కాబట్టే సుధీర్‌కు ఈ రేంజ్ ఫాలోయింగ్ పెరిగింది. బుల్లితెరపై తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ఇక ఇప్పుడు సుధీర్‌కు ఈటీవీకి, మల్లెమాలకు ఉన్న బంధాన్ని తెంచుకున్నాడు. స్టార్ మా చానెల్‌లోకి సుధీర్ వచ్చేశాడు. సుధీర్ ఇప్పుడు అక్కడే రఫ్పాడిస్తున్నాడు. సింగింగ్ షోలో అనసూయ, సుధీర్ కలిసి హోస్ట్ చేస్తున్నారు. అయితే కామెడీ స్టార్స్ గ్యాంగ్‌తో కలిసి పార్టీ చేద్దాం పుష్ప అనే ఈవెంట్‌ను స్టార్ మా నిర్వహించింది. ఇందులో పార్ట్ వన్..

Sudigali Sudheer Excellent Performance in Party Cheddam Pushpa part 2

Sudigali Sudheer Excellent Performance in Party Cheddam Pushpa part 2

గత ఆదివారం ప్రసారం చేసింది. ఇక ఇప్పుడు రెండో పార్ట్ కూడా రెడీ అయింది. దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఈ ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో సుధీర్ స్టంట్లు చేసినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పర్ఫామెన్స్‌ను ప్రోమోలో వదిలారు. ఆ స్టంట్లు చూసి అనసూయ నోరెళ్లబెట్టేసింది. అసలు ఇది చేసేటప్పుడు నీ మైండ్‌లో ఏం రన్ అయిందంటూ అడిగేసింది. అలా సుధీర్ తన పర్ఫామెన్స్‌తో ప్రోమోను వైరల్ చేసేశాడు. ఇక సుధీర్ పర్ఫామెన్స్ కోసం ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఎదురుచూస్తున్నారు. దటీజ్ సుధీర్ అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు. మొత్తానికి సుధీర్ రాకతో స్టార్ మా ప్రోగ్రాంల మీద అందరి దృష్టి పడింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి