Sudigali Sudheer : అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్న సుడిగాలి సుధీర్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :26 May 2022,6:00 pm

Sudigali Sudheer : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటుడు సుడిగాలి సుధీర్. దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా జబర్దస్త్‌ ద్వారా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తున్నాడు. ఫుల్‌ టైమ్‌ జబర్దస్త్‌ లో పార్ట్ టైమ్‌ ఇతర షో ల్లో కనిపిస్తూ అప్పుడప్పుడు నటుడిగా సినిమాల్లో కూడా కనిపిస్తూ వస్తున్నాడు. ఒక హీరో స్థాయి ఇమేజ్ ను దక్కించుకున్న సుధీర్‌ ఇప్పుడు అభిమానులను గందరగోళంకు గురి చేస్తున్నాడు. అసలు సుధీర్‌ ఎక్కడ ఉన్నాడు.. ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు అంటూ అభిమానులు సైతం జుట్టు పీక్కునే పరిస్థితి.

ఒక వైపు శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ కనిపిస్తున్నాడు. మరో వైపు వరుసగా సినిమాల్లో నటిస్తున్న కారణంగా షూటింగ్‌ ల్లో పాల్గొంటున్న కారణంగా జబర్దస్త్‌ లో ప్రస్తుతానికి కనిపించడం లేదు అంటున్నాడు. ఇలాంటి సమయంలో వేరే ఛానల్ లో ఒక రియాల్టీ షో లో అనసూయ తో కలిసి యాంకరింగ్‌ చేస్తున్నాడు. ఇంత బిజీ అంటున్న సుధీర్‌ ఎలా ఆ షో కు యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సుధీర్‌ జబర్దస్త్‌ కాకుండా మరేం చేసినా కూడా జనాలు ఊరుకోవడం లేదు. స్వయంగా ఆయన్నే విమర్శించేలా ఉన్నారు.

sudigali sudheer fans angry on him

sudigali sudheer fans angry on him

ఢీ డాన్స్ షో నుండి తప్పుకున్న సమయంలోనే చాలా మంది సుడిగాలి సుధీర్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. కొందరు మాత్రం పాపం సుధీర్ ను తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు జబర్దస్త్‌ లో కూడా కనిపించడం లేదు. రోజా వెళ్లి పోవడమే ఆలస్యం వెంటనే జబర్దస్త్‌ నుండి సుడిగాలి సుధీర్ కూడా వెళ్లి పోవడం చర్చనీయాంశంగా మారింది. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా జబర్దస్త్‌ ను చేస్తానంటూ గతంలో సుధీర్ మరియు గెటప్‌ శ్రీను లు చెప్పారు. కాని ఇప్పుడు వారిద్దరు కనిపించడం లేదు. దాంతో అభిమానులు గందరగోళంతో ఉన్నారు. అసలు సుధీర్‌ మళ్లీ జబర్దస్త్‌ లో వస్తాడా లేదా అనే విషయంలో క్లారిటీ కావాలంటూ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి