Sudigali Sudheer fans praying to god for Jabardasth Re Entry
Sudigali Sudheer : అవును… సుడిగాలి సుదీర్ జీవితంలోనే సరి దిద్దుకోలేనంత పెద్ద తప్పును చేశాడు. ఆ పెద్ద తప్పు మరి ఏదో కాదు.. ఈటీవీ, మల్లెమాలను వదిలి బయటకు వెళ్లి పోవడమే. హైపర్ ఆది మాదిరిగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో కొనసాగుతూ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేయడం లేదా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూ శ్రీదేవి డ్రామా కంపెనీని వదిలేయడం లాంటివి చేస్తే బాగుండేది. కానీ సుధీర్ మొత్తానికి మల్లెమాల మరియు ఈటీవీ కార్యక్రమాలను వదిలేసి పక్క ఛానల్ వెళ్లి పోయాడు. అక్కడి వారు రేటింగ్ రావడం లేదు అంటూ చేతులెత్తేయడంతో ఏం చేయాలో పాలు పోక సుడిగాలి సుధీర్ దిక్కులు చూస్తున్నాడు. హీరోగా వరుసగా అవకాశాలు వస్తున్నాయంటూ
చెప్పిన సుధీర్ ఎంత వరకు ఆ అవకాశాలు దక్కించుకుంటున్నాడు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఆయన కెరియర్ లో జబర్దస్త్ లో చేస్తున్న సమయంలో ఉన్నంత స్పీడ్ ఇప్పుడు లేదనే చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమం చేస్తున్నప్పుడే ఆయనకు వరుసగా సినిమా ఆఫర్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు ఆయనకు ఆ సినిమా ఆఫర్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ సుడిగాలి సుదీర్ ని అభిమానులు నెత్తిన పెట్టుకొని పూజించారు. కానీ ఆయన మాత్రం తనకు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమని చెప్పి వెళ్ళి పోయాడు. అక్కడ చాలా మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, కనుక సుడిగాలి సుదీర్ ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు.
Sudigali Sudheer fans praying to god for Jabardasth Re Entry
సుధీర్ టీవీ రంగంలోనే ఉండి ఉంటే కచ్చితంగా ఆయనకు అంతకు మించిన గుర్తింపు లభించేది అనడంలో సందేహం లేదు. తాను చేసిన పొరపాటు ఇప్పుడు కెరీర్ నే నాశనం చేయబోతుంది అని అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఒకప్పుడు సుడిగాలి సుధీర్ ని దేవుడు అంటూ పూజించిన వారు ఇప్పుడు ఆయన చేసిన తప్పుకు దండిస్తున్నారు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు అంటూ సుధీర్ బాధపడే విధంగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి సుధీర్ ని మల్లెమాల వారు జబర్దస్త్ లో మళ్లీ ప్రవేశించే అవకాశం ఇస్తే బావుండు అని ఆయన అభిమానులు దేవుని ప్రార్థిస్తున్నారు. కానీ అలా జరుగుతుందా అంటే అనుమానమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.