Home » Entertainment » Sudigali Sudheer Funny Skit With Getup Srini
Entertainment

Sudigali Sudheer : అందులో 20 ఏళ్ల అనుభవం ఉంది.. సుడిగాలి సుధీర్ కామెంట్లు వైరల్

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 2, 2022, 6:30 pm
Advertisement

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ బుల్లితెరపై సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్నస్థాయి నుంచి మొదలుపెట్టి స్టార్ స్టేటస్ తెచ్చుకున్నాడు. సైడ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు వెండితెరపై హీరోగానూ పేరు సంపాదించుకున్నాడు. సుధీర్ రష్మీ జోడి అయితే కొన్నేళ్ల నుంచి బుల్లితెరపై హాట్ టాపిక్‌గా రన్ అవుతూనే ఉంది. ఇప్పటీకీ ఈ ఇద్దరూ చేసే మ్యాజిక్ వేరే లెవెల్‌‌లో ఉంటుంది.ఇక సుడిగాలి సుధీర్ టీంకు ప్రాణం గెటప్ శ్రీను. ఆటో రాం ప్రసాద్ రాసే పంచులే ఆ టీంకు ఆయువు పట్టు. అలా ఈ ముగ్గురూ కలిసి టీంను ముందుకు కొనసాగిస్తున్నారు.

Advertisement

మధ్యలో కొన్ని రోజులు గెటప్ శ్రీను కనిపించలేదు. ఆ తరువాత రాం ప్రసాద్ కనిపించలేదు. ఇంకొన్ని రోజులు సుధీర్ కొన్ని పర్సనల్ పనుల వల్ల రాలేకపోయాడు. అలా ఏ ఒక్కరూ రాకపోయినా మిగతా ఇద్దరూ అడ్జస్ట్ చేసేసుకున్నారు.మొత్తానికి ఇప్పుడు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సుధీర్ టీంనే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అందులోనూ సుధీర్ మీద వేసే డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ హైలెట్ అవుతుంది. అందులో సుధీర్ తన మీద తాను వేసుకునే కొన్ని సెటైర్లుంటాయి.

Sudigali Sudheer Funny Skit With Getup Srini

Advertisement

అవి అందరినీ నవ్విస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ సెటైర్ వేశాడు.తాజాగా వేసిన స్కిట్లో wwe తరహాలో స్కిట్ వేశారు. అందులో బాక్సింగ్ చేశాడు సుధీర్. రెఫరర్‌గా శ్రీను నటించాడు. ఎన్నేళ్ల అనుభవం ఉంది అని గెటప్ శ్రీను అడుగుతాడు. 20 ఏళ్ల అనుభవం ఉందని అంటాడు సుధీర్. నేను అడిగింది బాక్సింగ్ గురించి కాదు అని శ్రీను అంటే.. నేను కూడా చెప్పింది బాక్సింగ్ గురించి కాదు అని సుధీర్ డబుల్ మీనింగ్ డైలాగ్ వేసేస్తాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి