Sudigali Sudheer : అవ‌మానంతోనే జ‌బ‌ర్ధ‌స్త్‌కి సుడిగాలి సుధీర్‌ దూర‌మ‌య్యాడా..!

Authored By Sam C | The Telugu News | Published on: July 13, 2022, 6:30 pm

Sudigali Sudheer : గత కొద్ది రోజులుగా జ‌బ‌ర్ధ‌స్త్ వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. జబర్ధస్త్ తో పాటు మల్లెమాలపై కిరాక్ ఆర్‌పీ ఆరోపణలు చేయ‌డంతో పాటు, కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకునే వారు కాదని పేర్కొన్నాడు. జబర్ధస్త్ లో అవమానం జరగడం వల్లే సుధీర్ బయటకు వచ్చాడని పేర్కొన్నాడు. కష్టపడి పనిచేసినా సరిగా భోజనం పెట్టేవారు కాదని తెలిపాడు. అయితే సుధీర్ జ‌బ‌ర్ధ‌స్త్ త‌ప్పుకోవ‌డం విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. సుడిగాలి సుధీర్‌ కొంత కాలంగా నెమ్మదిగా ఒక్కో షో నుంచి బయటకు తప్పుకుంటూ వస్తున్నారు. ఇందులో రష్మి, సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ ఎక్కువ అవ్వడం,

వారినే హైలైట్‌గా చూపించడంతో షోని డామినేట్ చేసే స్థాయికి ఎదిగారని, అందులో భాగంగానే `ఢీ` షో నుంచి రష్మి, సుధీర్‌లను తొలగించారని ప్రచారం జరిగింది. సుధీర్‌ `స్టార్‌ మా`లో నాగబాబుతో కలిసి ఓ షో చేస్తున్నారు. ఇందులోను అత‌డికి మంచి పేరు వ‌చ్చింది. అయితే సుడిగాలి సుధీర్‌ కి `జబర్దస్త్`లో ఘోర అవమానం జరిగిందని, గెటప్‌ శ్రీను, హైపర్‌ ఆది కూడా అందుకే `జబర్దస్త్` ని వీడాల్సి వచ్చిందని చెప్పడం పెద్ద దుమారం రేపుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది. దీనికితోడు `ఈటీవీ` వాళ్లు పెట్టే కండీషన్స్ కూడా సుధీర్‌ వెళ్లిపోవడానికి కారణమని టాక్‌. తమ ఛానెల్‌లో షోస్‌ చేసేటప్పుడు ఇతర టీవీ షోస్‌లో చేయొద్దనే నిబంధన ఉందట.

Sudigali Sudheer news viral in social media

Sudigali Sudheer news viral in social media

Sudigali Sudheer : సుధీర్ గురించే చ‌ర్చ‌..

ఈ కఠిన నిబంధన ఆర్టిస్టుల ఎదుగుదలని ఆపేస్తాయని, అది నచ్చకే, ఆ విషయంలో విభేదాల కారణంగానే సుధీర్‌ తప్పుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సుధీర్ జబర్దస్త్ విడిచి వెళ్లడానికి ఎంటువంటి వివాదాస్పద కారణాలు లేవు.. సుధీర్ సినిమాలు చేయడం, మంచి అవకాశాలు రావడంతో సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల జబర్థస్త్ ను వదలాల్సి వచ్చిందన్నారు. దానితో పాటు అగ్రిమెంట్ కూడా అయిపోవడంతో.. కూల్ గా సుధీర్ వెళ్ళిపోయాడన్నారు రామ్ ప్రసాద్. అలాగే సుధీర్ కి ఆర్థికంగా ఇంకా నిలదొక్కుకోవాలి అని ఉంది దాంతో మంచి ఆఫర్ రావడంతో వెళ్ళారు అని అన్నారు రామ్ ప్రసాద్. అయినా కూడా సుధీర్ ఇప్పటికీ మల్లెమాలని గౌరవిస్తారు అని రామ్ ప్రసాద్ ఇంటర్వ్యూలో వివరించాడు.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp