Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌ను మించిపోయిన హైపర్ ఆది.. ఏ విషయంలోనంటే?

Authored By mallesh | The Telugu News | Published on: February 1, 2022, 7:33 pm

Sudigali Sudheer : బుల్లితెరపై ‘జబర్దస్త్’ కమెడియన్లు చేసే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క కమెడియన్ తమదైన శైలిలో స్కిట్స్ చేస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వారు అవకాశాలు చేజిక్కించుకుని వెండితెరకూ పరిచయమయ్యారు. అలా భారీ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. ఇటు బుల్లితెర అటు వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. పంచ్ లై టైమింగ్స్ లో స్పెషలిస్ట్ గా పేరు గాంచిన హైపర్ ఆది..ఇటీవల ఓ విషయంలో సుడిగాలి సుధీర్ ను మించిపోయాడు.

హైపర్ ఆది ప్రతీ వారం తన దైన శైలిలో పంచులతో డిఫరెంట్ స్క్రిప్టు రాసుకుని వచ్చి ‘జబర్దస్త్’ స్టేజీపైన స్కిట్ పర్ఫార్మ్ చేసి జడ్జిలనే కాదు.. ఆడియెన్స్ ను కూడా మెస్మరైజ్ చేస్తుంటాడు. అలా తాజాగా తాను చేసిన స్కిట్ ద్వారా హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ రికార్డును బీట్ చేశాడు. యూట్యూబ్ లో ఆ స్కిట్ ను ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ స్కిట్ ద్వారా అతని ఫాలోయింగ్ అమాంతంగా పెరిగింది కూడా. ఇంతకీ హైపర్ ఆది చేసిన ఆ స్కిట్ ఏంటంటే..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ ఫిల్మ్ గా దూసుకుపోతున్నది.

Sudigali Sudheer Out hyper aadi in created new record in jabardast history

Sudigali Sudheer Out hyper aadi in created new record in jabardast history

Sudigali Sudheer : అంచెలంచెలుగా ఎదిగిన హైపర్ ఆది..

ఈ నేపథ్యంలో ‘పుష్ప’ పిక్చర్ స్పూఫ్ చేశాడు ఆది. తాను ‘పుష్ప’రాజు గెటప్ వేయగా, ఫాహిమా శ్రీవల్లిగా, శాంతి స్వరూప్ అనసూయగా, ఒరిజినల్ పిక్చర్ కేశవ పాత్ర పోషించిన ఆర్టిస్టు జగదీశ్ ను కూడా తీసుకొచ్చారు. ఈ స్కిట్ లో తనదైన స్థాయిలో పంచులు వేసి ఆది కడుపుబ్బ నవ్వించేశాడు. ఈ స్కిట్ కు అతి తక్కువ సమయంలోనే అనగా 24 గంటలలోనే కోటికిపైగా వ్యూస్ వచ్చాయి. అలా హైపర్ ఆది తన పేరిట రికార్డు నమోదు చేసుకున్నారు. గతంలో సుడిగాలి సుధీర్ స్కిట్‌కు ఇటువంటి రికార్డు క్రియేట్ కాగా, తాజాగా ఆ రికార్డును హైపర్ ఆది బ్రేక్ చేశాడు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp