Sudigali Sudheer punches on Rashmi Gautam
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్-రష్మీ ఈ జంట ఎక్కడ ఉంటే అక్కడ టన్నుల టన్నుల వినోదం దక్కుతుంది. ఈ మధ్య కాలంలో వీరిద్దరిని జంటగా చూసే అవకాశం చాలా తగ్గింది. ఈ క్రమంలో మా టీవి వారు హోళి సందర్భంగా సుధీర్, రష్మీతో ఫన్ జనరేట్ అయ్యేలా చేశారు. ఢీ షోలో ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను అలరించారు. అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ రష్మీ కలిసి ఏ ప్రోగ్రాం చేయడం లేదు. ఈ ఇద్దరూ ఇప్పుడు స్టార్ మా చానెల్లో కనిపించారు హోళీకి చేస్తోన్న ఈవెంట్‌లో సుధీర్ రష్మీ కనిపించారు. ఇక సుధీర్ కోసం చాలా కాలం తరువాత పాటలు పాడాడు. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్‌ను మళ్లీ పైకి లేపేశారు. ఇక యాంకర్ రవి అయితే ఈ ఇద్దరి గుట్టులాగేందుకు తెగ ప్రయత్నించాడు.
తాజాగా వదిలిన ఈ ప్రోమో వైరల్ అవుతోంది.చురా లియా అంటూ సుధీర్ పాడిన పాటకు రష్మీ సిగ్గు పడింది. సుధీర్‌కు ఏదైనా ఇవ్వాలని అనుకుంటే ఏం ఇస్తావ్? అని రష్మీని యాంకర్ రవి అడిగాడు. దీంతో రష్మీ తెగ మెలికలు తిరుగుతూ… ఇవ్వాలా? అని సుధీర్‌ను రష్మీ అడిగింది. కెమెరాముందు ఇచ్చేదే కదా? అని సుధీర్ రెచ్చిపోయాడు. నీకు సరసాలు ఎక్కువయ్యాయ్ అంటూ రష్మీ సిగ్గుతో అనేసింది. సుధీర్ నంబర్‌ను నీ ఫోన్‌లో ఏ పేరుతో సేవ్ చేసుకున్నావ్? అంటూ రష్మీని రవి ఇరికించేశాడు. దీంతో రష్మీ తెగ సిగ్గుపడిపోయింది. మొత్తానికి ప్రోమో ప్రేక్షకులకి ఫుల్‌గా నచ్చేసింది.రష్మి గౌతమ్ అయినా కనీసం కొన్ని సినిమాలు చేసింది. అలా ఆమెకు కనీస గుర్తింపు ఉంది.
Sudigali Sudheer punches on Rashmi Gautam
కానీ సుధీర్ మాత్రం ఎవరికీ తెలియదు. ఓ మెజీషియన్‌గా ఇండస్ట్రీకి వచ్చి.. అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు స్టార్ అయ్యాడు సుడిగాలి సుధీర్. ఈయన జర్నీలో.. ఎదగడంతో అడుగడుగునా సాయం చేసింది మాత్రం మల్లెమాల ప్రొడక్షన్స్. కేవలం వాళ్ల వల్లే ఈ రోజు సుధీర్ స్టార్ అయ్యాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మల్లెమాల షోలో లేకుండా మా టీవీ షోలో సుధీర్ ప్రత్యక్షం అయ్యే సరకు అందరు ఆశ్చర్యపోతున్నారు. ఏమైంది, సుధీర్ గుడ్ బై చెప్పినట్టేనా అని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.