Sudigali Sudheer : ర‌వి అడ‌గ్గానే సుడిగాలి సుధీర్‌కి ఇస్తాన‌న్న రష్మి గౌతమ్.. కెమెరా ముందు వ‌ద్దంటూ పంచ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sudigali Sudheer : ర‌వి అడ‌గ్గానే సుడిగాలి సుధీర్‌కి ఇస్తాన‌న్న రష్మి గౌతమ్.. కెమెరా ముందు వ‌ద్దంటూ పంచ్

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్-ర‌ష్మీ ఈ జంట ఎక్క‌డ ఉంటే అక్క‌డ ట‌న్నుల ట‌న్నుల వినోదం ద‌క్కుతుంది. ఈ మధ్య కాలంలో వీరిద్ద‌రిని జంట‌గా చూసే అవ‌కాశం చాలా త‌గ్గింది. ఈ క్రమంలో మా టీవి వారు హోళి సంద‌ర్భంగా సుధీర్, ర‌ష్మీతో ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యేలా చేశారు. ఢీ షోలో ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను అలరించారు. అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ రష్మీ కలిసి ఏ ప్రోగ్రాం చేయడం లేదు. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :16 March 2022,2:30 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్-ర‌ష్మీ ఈ జంట ఎక్క‌డ ఉంటే అక్క‌డ ట‌న్నుల ట‌న్నుల వినోదం ద‌క్కుతుంది. ఈ మధ్య కాలంలో వీరిద్ద‌రిని జంట‌గా చూసే అవ‌కాశం చాలా త‌గ్గింది. ఈ క్రమంలో మా టీవి వారు హోళి సంద‌ర్భంగా సుధీర్, ర‌ష్మీతో ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యేలా చేశారు. ఢీ షోలో ఇంతకు ముందు ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను అలరించారు. అయితే ఇప్పుడు మాత్రం సుధీర్ రష్మీ కలిసి ఏ ప్రోగ్రాం చేయడం లేదు. ఈ ఇద్దరూ ఇప్పుడు స్టార్ మా చానెల్లో కనిపించారు హోళీకి చేస్తోన్న ఈవెంట్‌లో సుధీర్ రష్మీ కనిపించారు. ఇక సుధీర్ కోసం చాలా కాలం తరువాత పాటలు పాడాడు. ఈ ఇద్దరి మధ్య రొమాంటిక్ యాంగిల్‌ను మళ్లీ పైకి లేపేశారు. ఇక యాంకర్ రవి అయితే ఈ ఇద్దరి గుట్టులాగేందుకు తెగ ప్రయత్నించాడు.

తాజాగా వదిలిన ఈ ప్రోమో వైరల్ అవుతోంది.చురా లియా అంటూ సుధీర్ పాడిన పాటకు రష్మీ సిగ్గు పడింది. సుధీర్‌కు ఏదైనా ఇవ్వాలని అనుకుంటే ఏం ఇస్తావ్? అని రష్మీని యాంకర్ రవి అడిగాడు. దీంతో రష్మీ తెగ మెలికలు తిరుగుతూ… ఇవ్వాలా? అని సుధీర్‌ను రష్మీ అడిగింది. కెమెరాముందు ఇచ్చేదే కదా? అని సుధీర్ రెచ్చిపోయాడు. నీకు సరసాలు ఎక్కువయ్యాయ్ అంటూ రష్మీ సిగ్గుతో అనేసింది. సుధీర్ నంబర్‌ను నీ ఫోన్‌లో ఏ పేరుతో సేవ్ చేసుకున్నావ్? అంటూ రష్మీని రవి ఇరికించేశాడు. దీంతో ర‌ష్మీ తెగ సిగ్గుప‌డిపోయింది. మొత్తానికి ప్రోమో ప్రేక్ష‌కుల‌కి ఫుల్‌గా న‌చ్చేసింది.రష్మి గౌతమ్ అయినా కనీసం కొన్ని సినిమాలు చేసింది. అలా ఆమెకు కనీస గుర్తింపు ఉంది.

Sudigali Sudheer punches on Rashmi Gautam

Sudigali Sudheer punches on Rashmi Gautam

Sudigali Sudheer : ఫుల్ పంచ్‌లు..

కానీ సుధీర్ మాత్రం ఎవరికీ తెలియదు. ఓ మెజీషియన్‌గా ఇండస్ట్రీకి వచ్చి.. అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు స్టార్ అయ్యాడు సుడిగాలి సుధీర్. ఈయన జర్నీలో.. ఎదగడంతో అడుగడుగునా సాయం చేసింది మాత్రం మల్లెమాల ప్రొడక్షన్స్. కేవలం వాళ్ల వల్లే ఈ రోజు సుధీర్ స్టార్ అయ్యాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు మ‌ల్లెమాల షోలో లేకుండా మా టీవీ షోలో సుధీర్ ప్ర‌త్య‌క్షం అయ్యే స‌ర‌కు అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏమైంది, సుధీర్ గుడ్ బై చెప్పిన‌ట్టేనా అని అంద‌రు ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by STAR MAA (@starmaa)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది