Sudigali Sudheer to ETV anniversary and insulted him
Sudigali Sudheer : ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుదీర్ మంచి ఫేమ్ దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆయన టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు అంటే అది కేవలం జబర్దస్త్ వల్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. జబర్దస్త్ తెచ్చిన స్టార్ డం కారణంగానే సుడిగాలి సుదీర్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసుకుంటున్నాడు. ఈ సమయంలోనే జబర్దస్త్ నుండి ఆయన వెళ్లి పోవడం కొందరికి నచ్చడం లేదు. ముఖ్యంగా మల్లెమాల మరియు ఈటీవీ లో ఉన్న వారికి సుడిగాలి సుదీర్ అంటే చాలా కోపంగా ఉంది. లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను వదిలి వెళ్లి పోయిన సుడిగాలి సుదీర్ అంటే చాలా మంది ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
తాజాగా ఆ కోపం ను చూపించే ప్రయత్నం చేశారు వారు. ఇటీవల ఈటీవీ వార్షికోత్సవం సందర్భంగా సుడిగాలి సుదీర్ ఒక ప్రత్యేక కార్యక్రమం కి హాజరయ్యాడు. ఈటీవీలో మళ్లీ సుడిగాలి సుదీర్ కనిపించడేమో అని అనుకుంటూ ఉండగా వార్షికోత్సవ కార్యక్రమంలో చాలా మందితో పాటు ఆయన కూడా పాల్గొనడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సుడిగాలి సుదీర్ ఈ కార్యక్రమంలో హాజరు అయిన సమయంలో ఆయనను అవమానించారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సరైన మర్యాద ఇవ్వకుండా ఆయన చేసిన స్కిట్ కూడా ఎడిట్ చేసి చాలా వరకు ఆయనను చూపించకుండా మేనేజ్ చేశారు అంటూ విమర్శలు వస్తున్నాయి.
Sudigali Sudheer to ETV anniversary and insulted him
గతంలో మాదిరిగా కాకుండా సుడిగాలి సుదీర్ ఏదో వచ్చి వెళ్ళాడు అన్నట్లుగానే కనిపించాడు. ఇది ఆయన్ను అవమానించడమే అంటూ యూట్యూబ్లో వీడియోల కింద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఏదో పాపం అంటూ వస్తే ఇలా అవమానిస్తారా అంటూ చాలా మంది సుదీర్ ఫ్యాన్స్ ఆవేశంతో ఈ టీవీ వర్గాల వారిని విమర్శిస్తున్నారు. సుడిగాలి సుదీర్ ని హైపర్ ఆది మరియు ఇతర జబర్దస్త్ కమెడియన్స్ కూడా తీవ్రంగా అవమానపరిచి స్కిట్ చేసి నవ్వించే ప్రయత్నం చేశారు. అందుకు కూడా సుధీర్ అభిమానులు తీవ్రంగా నొచ్చుకున్నారు. ఈ విషయమై సుధీర్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
This website uses cookies.