
sudigali sudheer wild card entry in to biggboss season 6
Sudigali Sudheer : బుల్లితెర సూపర్ స్టార్ అంటూ సుడిగాలి సుధీర్ ని ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు.. అది గతం అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బుల్లి తెరపై ఆయన సందడి తగ్గి పోయిందని.. ఆయన ఇక కనిపించడంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలను వదిలి వెళ్ళి పోయినా సుడిగాలి సుధీర్ కి స్టార్ మా వారు పెద్ద షాకిచ్చారు. అక్కడ ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చి ఆ కార్యక్రమం ను క్యాన్సల్ చేశారట. బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో తాము ఆ కార్యక్రమాన్ని చేయలేమంటూ చేతులెత్తేయడంతో సుడిగాలి సుధీర్ తిరిగి ఈటీవీలోకి వెళ్లలేక.. ఏం చేయాలో పాలు పోక ఇబ్బందులు పడుతున్నాడట.
ఎలాగో స్టార్ మా వాళ్లు ఈటీవీ నుండి సుడిగాలి సుధీర్ ని తీసుకొచ్చారు కనుక ఇప్పుడు వాళ్లే ఏదో ఒక దారి చూపించే ప్రయత్నం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. బుల్లి తెర వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్బాస్ సీజన్ 6 ఐదవ వారంలో సుడిగాలి సుధీర్ సడన్ ఎంట్రీ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న సుడిగాలి సుధీర్ కి కచ్చితంగా మంచి ఆదరణ లభించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించలేక పోతున్నారు. అందుకే ఈ సమయంలో సుడిగాలి సుధీర్ హౌస్ లోకి వెళితే కచ్చితంగా ఒక మంచి రేటింగ్ అనేది నమోదు అయ్యే అవకాశం ఉంటుంది, ఆ కారణంగానే సుడిగాలి సుధీర్ కి భారీ పారితోషకం ఆఫర్ చేసి మరి బిగ్ బాస్ (Bigg boss )హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది.
sudigali sudheer wild card entry in to biggboss season 6
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ క్వారెంటైన్ లో ఉన్నాడట. సోమవారం ఎపిసోడ్ లేదా మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో సుడిగాలి సుదీర్ అడుగు పెట్టే అవకాశం ఉందంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఇప్పటికే బుల్లి తెర ద్వారా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ లోకి వెళ్లడంను కొందరు వ్యతిరేకిస్తుంటే.. కొందరు మాత్రం ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగానే ఉందంటూ సుడిగాలి సుధీర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు, కానీ ఒకటి రెండు రోజుల్లోనే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.