BiggBoss 6 Telugu : ఎన్నో అంచనాలతో.. హంగులతో.. ఆర్భాటాలతో మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 ఇదివరకు ఏ సీజన్ కి కూడా అనిపించని.. వినిపించని కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సీజన్ కంటెస్టంట్స్ ని చూసే ఆడియన్స్ లో నిరుత్సాహం వచ్చేసింది. సగానికి పైగా పెద్దగా ఎవరికి తెలియని వారిని తెచ్చి పెట్టారని ఫీల్ అయ్యారు. పోనీ వారాలు గడుస్తున్నా కొద్దీ కంటెంట్ ఏమైనా ఇస్తున్నారా అంటే సోది ముచ్చట్లు తప్ప వేరే మ్యాటర్ ఏది లేదని చెప్పొచ్చు. కంటెంట్ విషయంలో ఈ సీజన్ డిజాస్టర్ అని చెప్పడానికి బెస్ట్ ఎక్సాంపుల్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అని చెప్పొచ్చు.
బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ లో హౌస్ మెట్స్ అంతా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేశారు. జరిగిన ఐదు సీజన్లలో ఇలాంటి టాస్క్ ఒకటి ఇవ్వగా అందరు దాన్ని ఓన్ చేసుకుని వారు ఎంజాయ్ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. కానీ ఈ సీజన్ లో అలా జరగలేదు.బిగ్ బాస్ కలుగచేసుకుని ఇక ఆపండ్రా బాబోయ్ అనేంతగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టాస్క్ ఇలా అర్ధాంతరంగా ముగించేస్తారని ఎవరు ఊహించలేదు. ఇక జబర్దస్త్ నుంచి వచ్చిన చంటి సీక్రెట్ టాస్క్ ని సీరియస్ గా తీసుకోలేదు సరికదా నాకు నచ్చలేదు అందుకే చేయలేదని చెప్పి షాక్ ఇచ్చాడు.
బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ నచ్చలేదని చెప్పడం ఏంటో ఆయనకే తెలియాలి.అయితే ఇలా ఎలాంటి కంటెంట్ ఇవ్వలేని ఈ సీజన్ కంటెస్టంట్స్ ని చూసి ఆడియన్స్ కూడా ఇక బిగ్ బాస్ చూడటం వేస్ట్ అనే భావనకి వచ్చేశారు. ఇలా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ని హోస్ట్ నాగార్జున (Nagarjuna ) గారే సేవ్ చేయాలని కొందరు బిగ్ బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సీజన్ ఇంత నీరసంగా జరుగుతుంది కాబట్టే రేటింగ్స్ కూడా అంతే దారుణంగా వస్తున్నాయి. ఈ వీకెండ్ నాగార్జున కూడా హౌస్ మెట్స్ మీద బాగానే ఫైర్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల సడెన్ గా ఆయన ప్లాన్ మార్చి వేరే టాస్క్ ఇవ్వాల్సి వచ్చింది. దీనికి నాగ్ హౌస్ మెట్స్ అందరికి బాగానే క్లాస్ పీకేలా ఉన్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.