Rangastalam 2 : రామ్ చరణ్ తో సుకుమార్ నెక్స్ట్ మూవీ.. రంగస్థలం సీక్వెల్ రానుందా..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rangastalam 2 : రామ్ చరణ్ తో సుకుమార్ నెక్స్ట్ మూవీ.. రంగస్థలం సీక్వెల్ రానుందా..?

Rangastalam 2 : దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్రం మొదటి భాగం విజయవంతం కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుండగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. మీడియా ఇంటర్వ్యూలు, బుల్లి తెర ప్రోగ్రాంలంటూ ఖాళీ లేకుండా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర అంశాలను బయటపెట్టారు. పుష్ప రెండు భాగం అనంతరం.. రామ్ చరణ్‌తో […]

 Authored By inesh | The Telugu News | Updated on :24 December 2021,8:30 pm

Rangastalam 2 : దర్శకుడు సుకుమార్ పుష్ప చిత్రం మొదటి భాగం విజయవంతం కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుండగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. మీడియా ఇంటర్వ్యూలు, బుల్లి తెర ప్రోగ్రాంలంటూ ఖాళీ లేకుండా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఆసక్తికర అంశాలను బయటపెట్టారు. పుష్ప రెండు భాగం అనంతరం..

రామ్ చరణ్‌తో కూడా మరో సినిమా ఉంటుందని గతంలో చెప్పగా.. ఇప్పుడు ఆ తర్వాత వచ్చే ప్రాజెక్ట్ రౌడీ హీరో విజయ దేవరకొండ తో ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తరువాతే రామ్ చరణ్ తో మూవీ ఉంటుందన్నారు. దీంతో మరోసారి రంగస్థలం సీక్వెల్ అంశం తెరపైకి వచ్చింది. మెగా పవర్ స్టార్ తో సుక్కు చేయబోయే సినిమా కచ్చితంగా రంగస్థలం పార్ట్ 2 అయి ఉంటుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.అయితే ఈ కామెంట్లపై సుకుమార్ గానీ రామ్ చరణ్ గానీ ఎక్కడా స్పందించడం లేదు.

Sukumar next movie with Ram Charan Rangastalam 2

Sukumar next movie with Ram Charan Rangastalam 2

ఏదీ ఏమైనా తమ అభిమాన నటుడు మరోసారి సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారని తెలియగానే చెర్రీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ మైలు రాయిగా నిలిచి పోయింది. 1980 లలో పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గాను మంచి విజయం సాధించింది. ఇందులో నటించిన రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, అనసూయకు మంచి పేరుతో పాటు అవార్డులను తెచ్చి పెట్టింది.

inesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది