Samantha : ఆ గ్యాంగ్‌కి లీడ‌ర్ స‌మంత‌నే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో షాకింగ్ కామెంట్స్ చేసిన సుకుమార్

 Authored By sandeep | The Telugu News | Updated on :28 February 2022,9:30 pm

Samantha : లెక్క‌ల మాస్టారు సుకుమార్ రీసెంట్‌గా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే ప్రీ రిలీజ్‌కి గెస్ట్‌గా హాజ‌రైన విష‌యం తెలిసిందే. టాలెంటెడ్ హీరో శర్వానంద్ , నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్‎టైనర్‍గా తెరకెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో వహించారు. ఇందులో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్, ఖుష్బూ, ఊర్వశీ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా.. ఫిబ్రవరి 27న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఈ వేడుకకు స్టార్ హీరోయిన్స్ సాయి పల్లవి, కీర్తి సురేష్.. డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ మాట్లాడుతూ.. హీరోయిన్స్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఈ ఈవెంట్లో ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ తన ఫేవరేట్ హీరోయిన్, హీరో ఎవరో వెల్లడించారు. తన ఫేవరెట్ హీరోయిన్ సుమ అంటూ సెటైర్ పేల్చిన సుకుమార్… శర్వా తనకు ఇష్టమైన నటుడు అని అన్నారు. ఇక తన శ్రీవల్లి రష్మికనూ వదల్లేదు. నీ పేరేంటి ? అంటూ సరదాగా రష్మిక పేరును మర్చిపోయినట్టు యాక్ట్ చేశారు.

sukumar surprising comments on samantha

sukumar surprising comments on samantha

Samantha : స‌మంత గ్యాంగ్ లీడ‌ర్..

ఇక రష్మిక, సాయి పల్లవి, కీర్తి సురేష్… ఈ గ్యాంగ్ లో గ్యాంగ్ లీడర్ సమంత మిస్ అయ్యిందని, ఈ నలుగురు హీరోయిన్లూ ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారని కితాబునిచ్చారు. ఆ తరువాత “ఆడవాళ్లు మీకు జోహార్లు” మీకు హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తూ చిత్రబృందాన్ని విష్ చేశారు సుకుమార్. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా అదిరిపోయింది అని దేవీ శ్రీ ప్రసాద్ చెప్పాడు. ఈ సినిమా కామెడీతోపాటు.. ఎమోషన్స్ కూడా కలగలిపి ఉన్నాయి. ఈ మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. శర్వా గురించి గతంలోనే చూశాను. ఎప్పుడో సూపర్ హిట్ కొట్టేశాడు అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి