sunil clears the politics news
Sunil : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజాక్షేత్రంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. 2024 ఎలక్షన్స్ కోసం పవన్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ క్రమంలోనే సునీల్‌ని రంగంలోకి దించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సునీల్‌కి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. సునీల్ సినిమాల కోసం ఈ మెగా హీరోలు పలుమార్లు ప్రమోషన్ కూడా చేశారు. మరోవైపు పవన్ స్నేహితుడైన త్రివిక్రమ్‌కి సునీల్ చాలా క్లోజ్. ఈ క్రమంలో యాక్టర్ సునీల్ ను భీమవరం నుండి బరిలో దింపితే కచ్చితంగా గెలిపించి తీరుతామంటున్నారు. దీంతో జనసేన అధినేత సైతం ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
సునీల్ పుట్టిపెరిగింది భీమవరం కావడం.. అతనికి అక్కడ మంచి ఫాలోయింగ్ ఉండటంతో పాటుగా.. జనసైనికులు మద్దతు.. కుల సమీకరణాల నేపథ్యంలో హీరో సునీల్ బరిలోకి దిగడం ఖాయం పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ పవన్‌తో జరిగిన మీటింగ్ విషయాలను బహిర్గతం చేశారు హీరో సునీల్.ఇటీవల జనసేనలో చేరబోతున్నట్టు బాగా వార్తలు వచ్చాయి. నేను పాలిటిక్స్‌కి క్వాలిఫైడ్ పర్సన్‌ని కాదు.. కానీ పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ఆయన నాకు బాగా క్లోజ్.. ఆయనతో మంచి అనుబంధం ఉంది. నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఆయనకి నిజంగానే మనసులో ఉంది.. నన్ను పార్టీలోకి తీసుకోవాలి.. కానీ నాకు ఇష్టం లేదు.
sunil clears the politics news
ఎందుకంటే మనకి జనాభా ఎక్కువ.. ఫండ్స్ తక్కువ.. ఈ ఫండ్స్‌ని అటూ ఇటూ అడ్జెస్ట్ చేయాలి.. ఈ అడ్జెస్ట్‌మెంట్‌లో అందరికీ న్యాయంచేయలేం. న్యాయం జరగనివాళ్లు ఫీల్ అవుతారు. ఈ ప్రాసెస్‌లో మనం ఎవర్నీ సంతృప్తి పరచలేం. అలాంటప్పుడు మనం ఒకరితో మాట ఎందుకు అనిపించుకోవాలని నాకు ఉంటుంది. అందుకే కళ్యాణ్ గారు అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం.. ఆయనకి నా వంతుగా ఏదైనా చేయగిలిగినప్పుడు మాత్రం తప్పుకుండా చేస్తాను. అయితే అది రాజకీయంగా కాదు. ఎందుకంటే నాకు రాజకీయం అంటే ఏంటో తెలియదు అని తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు హీరో సునీల్.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.